ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా కొనసాగారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మంత్రి పదవిని స్వీకరించారు. ఇక సినిమారంగంలో, రాజకీయరంగంలో చాలా చురుగ్గా పాల్గొంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రోజా సినిమాలలో పెద్దగా నటించలేదు. కేవలం చిన్న చిన్న పాత్రలకే పరిమితమైంది. తనకు సమయం దొరికినప్పుడల్లా పలు షోలు, జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేది.
ఇక మంత్రి పదవి స్వీకరించిన తర్వాత జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో బిజీగా మారిపోయారు రోజా. ఈ క్రమంలోనే మంత్రి రోజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఇక రోజా హీరోయిన్గా నటిస్తున్న సమయంలో తనతో పాటు ఉన్న హీరోయిన్లందరూ ప్రస్తుతం అమ్మ, అత్త పాత్రలకు పరిమితమయ్యారు. ఇక నేను కూడా మళ్లీ సినిమాల్లో నటించి ఆ పాత్రలకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నా పదవికి న్యాయం చేయాలని అనుకుంటున్నాను అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పాను. కొన్ని రోజుల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తానని రోజా చెప్పుకొచ్చారు. కాగా, రోజా ఫేవరెట్ హీరో మహేష్ బాబు అన్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement
ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబుతో ఎప్పుడు నటిస్తున్నారు అని ప్రశ్నించగా…. దానికి రోజా సమాధానం ఇచ్చారు. మహేష్ బాబుతో నటించాలని నాకు చాలా పెద్ద కోరిక ఉంది. దానికోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. అయితే మహేష్ కి అమ్మ, అత్త పాత్రలలో కాకుండా అక్క, వదిన పాత్రలలో నటించాలని అనుకుంటున్నానంటూ రోజా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రోజా చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక రోజా మహేష్ బాబుతో నటించి తన కోరిక ఎప్పుడు నెరవేర్చుకుంటుందో చూడాలి. ఇక మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా అనంతరం మహేష్ బాబు…. రాజమౌళితో కలిసి ‘SSMB 29’ సినిమాలో నటించబోతున్నారు.
ఇవి కూడా చదవండి
- చిరంజీవిని తిట్టినందుకు కొడాలి నానిపై సీరియస్ అయిన ఎన్టీఆర్ !
- కొన్నేళ్ల తర్వాత రెండో పెళ్లిపై ఆలోచిస్తా: రేణు దేశాయ్
- Mega family : లావణ్య తర్వాత మెగా ఇంటికి మరో హీరోయిన్ కోడలు కాబోతోందా..?