జూనియర్, ఎన్టీఆర్ కొడాలి నాని మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. కానీ వీరిద్దరి మధ్య స్నేహం ఓ మిస్టరీగా ఉంటుంది. వీరిద్దరి మధ్య చాలా మంచి స్నేహం ఉండేది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ… నా ప్రాణ స్నేహితులలో కొడాలి నాని తప్పకుండా ఉంటాడు అని చెప్పుకొచ్చాడు. ఏదైనా సమస్య ఉందంటే తన ప్రాణాన్ని అయినా ఇచ్చేంత గొప్ప స్నేహితుడు అని చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్.
మరి ఇప్పటికీ వీరిద్దరూ ప్రాణ స్నేహితులేనా అంటే అవుననే చెప్పాలి. కానీ వీరిద్దరూ బయట ఎక్కడా కలిసి కనిపించడం లేదు. వీరిద్దరి మధ్య రాజకీయాలపరంగా ఎన్ని విభేదాలు వచ్చినప్పటికీ ఒకరిని ఒకరు విమర్శించుకోరు. గతంలో వైసిపి నేతలు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై కొన్ని వాక్యాలు చేస్తే వాటిని ఎన్టీఆర్ ఖండించారు. అయితే ఈ మధ్యకాలంలో కొడాలి నాని… చిరంజీవిపై కొన్ని కామెంట్స్ చేశారు.
Advertisement
Advertisement
ఆ విషయం పెద్ద వివాదాస్పదంగా మారింది. ఆ కామెంట్స్ పై జూనియర్ ఎన్టీఆర్ ఫీలయ్యారట. మెగాస్టార్ లాంటి పెద్ద నటుడిని, సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తిట్టడంతో నానిని నిడదీశారట. దీంతో నాని పొరపాటున అన్నాను అని సరి చేసుకున్నారట. రాజకీయాల్లోకి సినిమా వాళ్ళని లాగొద్దని చెప్పడంతో నేను చిరంజీవిని అనలేదని, చిరంజీవికి నేను పెద్ద ఫ్యాన్ ని నేను అంటూ చెప్పారట. అంతేకాకుండా చిరంజీవి పుట్టినరోజు వేడుకలను కూడా కొడాలి నాని ఘనంగా నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
- కొన్నేళ్ల తర్వాత రెండో పెళ్లిపై ఆలోచిస్తా: రేణు దేశాయ్
- Mega family : లావణ్య తర్వాత మెగా ఇంటికి మరో హీరోయిన్ కోడలు కాబోతోందా..?
- చంద్రబాబు అరెస్ట్ వెనుక వాళ్లే ఉన్నారు… హైదరాబాద్ లో ధర్నా చేసుకోండి కానీ ఒక షరతు ! – మంత్రి కేటీఆర్..!!