సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ఒకపక్క రాజకీయాల్లో ఇంకో పక్క సినిమాల్లో కూడా బిజీగా ఉండేవారు. ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్నప్పుడు మోహన్ బాబు కూడా మంచి హీరోగా అవకాశాలని పొందుతూ ఉన్నారు. అయితే ఆ టైంలో ఎన్టీఆర్ తో కలిసి నటించాలని మోహన్ బాబు అనుకున్నారట. ఇద్దరి మధ్య బాండింగ్ బాగా ఉండేదట అటువంటి సమయంలో నో చెప్పలేదు. ఎన్టీఆర్ స్క్రిప్ట్ చేతికిచ్చి ఏ పాత్ర వేయాలని అనుకుంటున్నారు అని మోహన్ బాబు తో ఎన్టీఆర్ చెప్పారు సామ్రాట్ అశోక్ సినిమాలో అశోక చక్రవర్తికి సన్నిహితుడైన రుద్ర దేవుడు పాత్రని మోహన్ బాబుకి ఇచ్చారు.
Advertisement
ఇక మోహన్ బాబు ఎంతో సంతోషపడ్డారట. బసవతారకం ట్రస్ట్ కోసం ఒక బిల్డింగ్ ని కట్టాలని ఎన్టీఆర్ అనుకున్నారు. అయితే ఈ షూటింగ్ టైంలో మోహన్ బాబు ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని మోహన్ బాబు అనుకున్నట్లు చెప్పారు. ఎలక్షన్లలో ఓడిపోయాను నా సినిమా ఎవరు చూస్తారని మోహన్ బాబు చెప్పారు. కానీ బయట బ్యానర్ లో ఒక సినిమా చేయాలని ఎన్టీఆర్ అనుకున్నారట. బయట సినిమా చేయాలని ఎన్టీఆర్ అనుకున్నారు కాబట్టి మోహన్ బాబు నా సినిమా చేయమని అడిగారట మేజర్ చంద్రకాంత్ సినిమా కథని ఎన్టీఆర్ కి చెప్పారు.
Advertisement
పెద్ద పెద్ద యాక్టర్లను కూడా సినిమాలో పెట్టారు నారా చంద్రబాబునాయుడు కెమెరా స్విచ్ ని ఆన్ చేశారు. ఎంతో ఘనంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి ఉప్పొంగిపోయారు. ఈ సినిమా ఒప్పుకోగానే మోహన్ బాబు పాతిక లక్షలు ఇవ్వబోయారు ఎన్టీఆర్ నేనేమైనా డబ్బులు అడిగానా..? ఎంత వస్తే అంత ఇవ్వి చేతికి అని చెప్పగా రెండు చేతులు పెట్టి రెండున్నర లక్షలు దాకా మోహన్ బాబు ఎన్టీఆర్ కి ఇచ్చారట. అయితే ఎంత ఇచ్చారు అనేది మోహన్ బాబుకి మాత్రమే తెలుసు అని మోహన్ బాబు ఈ విషయాన్ని ఒకసారి చెప్పారు.
Also read:
- క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన హేమ.. శ్రీదేవికి డూప్ గా నటించారని.. తెలుసా..?
- సూపర్ స్టార్ కృష్ణ అస్తి కంటే విలువైనది… మహేష్ బాబు కి ఇచ్చారట…!
- రిలేషన్ సరిగా లేకపోతే… ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి.. జాగ్రత్త..!