సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు. మహేష్ బాబు కృష్ణ తర్వాత సినిమాల్లో నటిస్తూ, తండ్రికి తగ్గ తనయుడుగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. పాపులర్ హీరోగా ఎదిగిపోయారు మహేష్ బాబు. మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కూడా హీరోగా వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మహేష్ బాబు తాజాగా తన భార్య నమ్రత తో ఒక కార్యక్రమానికి హాజరు అయ్యారు. తన కెరియర్, జీవితం గురించి కొన్ని విషయాలని షేర్ చేసుకున్నారు మహేష్ బాబు. హీరో అవ్వడం అంత ఈజీ కాదు అని.. ఎంతో ఒత్తిడి ఉంటుందని మహేష్ బాబు చెప్పారు.
Advertisement
Advertisement
సినిమాలు సక్సెస్ అయితే సంతోషపడతారు. అదే ఫెయిల్ అయితే టెన్షన్, కోపం, చిరాకు కూడా వస్తాయని చెప్పారు మహేష్. సినిమాలు హిట్ కాకపోతే బలహీనంగా తయారవుతారని చెప్పారు. కానీ తండ్రి కృష్ణ తనకి జయాలు అపజయాలని సమతుల్యంగా ఎలా ఎదుర్కోవాలో చెప్పారట. ఆస్తి మాత్రమే కాదు. ఇలాంటివి కూడా మహేష్ కి కృష్ణ ఇచ్చారట. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. అలానే రాజమౌళితో మహేష్ బాబు ఒక సినిమా చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. గుంటూరు కారం తర్వాత రాజమౌళితో కలిసి పని చేస్తారట మహేష్ బాబు.
Also read:
- రిలేషన్ సరిగా లేకపోతే… ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి.. జాగ్రత్త..!
- పచ్చ కర్పూరం తో ఈ సమస్యలకి చెక్ పెట్టేయండి…!
- బియ్యం కడిగిన నీళ్లతో.. ఇలా మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి…!