ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ లో టీమిండియా చేతిలో ఘోర పరాజయం చవిచూసిన పాకిస్తాన్ జట్టుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రెండు దాయాది దేశాల పోరు అంటే ఫ్యాన్స్ చాలానే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ పాకిస్తాన్ టీమిండియా ముందు ఏమాత్రం నిలవలేకపోయింది. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అహ్మదాబాద్ వేదికగా భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ లో అంత హోరాహోరీగా సాగకపోయినా అభిమానులకు మాత్రం మంచి మజాను అందించింది.
మ్యాచ్లో రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. రోహిత్ గొప్ప ఇన్నింగ్స్ లో అనేక రికార్డులు బద్దలు అయ్యాయి. దానికి తోడు కెప్టెన్ బాబర్ అజామ్ చేసిన పని కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ అనంతరం కింగ్ కోహ్లీ వద్దకు వచ్చిన బాబర్ సంతకం చేసిన జెర్సీనీ ఇవ్వాలని అడిగాడు. దాంతో కోహ్లీ జెర్సీపై సంతకం చేసి ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై వసీమ్ అక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Advertisement
Advertisement
బాబర్ అలా చేయాల్సి ఉండకూడదని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఆట అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వద్ద ప్రైవేట్ గా ఆ జెర్సీని తీసుకోవాల్సి ఉండేది అని బాబర్ ను ఉద్దేశించి అక్రమ్ కామెంట్స్ చేశారు. పబ్లిక్ గా కోహ్లీని కలిసేందుకు అది సరైన సమయం కాదని, ఎందుకంటే పబ్లిక్ గా వెళ్లి కోహ్లీ సిగ్నేచర్ చేసిన జెర్సీని తీసుకోవడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్.
ఇవి కూడా చదవండి
- లక్కీ ఛాన్స్ కొట్టేసిన రతిక రోజ్… ఆ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
- IND vs PAK మ్యాచ్ లో జై శ్రీరామ్ నినాదాలు.. ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు
- నిహారికకు లావణ్య టార్చర్…ఇంట్లో కూడా ఉండద్దు అంటూ ?