Home » పవన్ లో ఏదో లోపం ఉంది..అందుకే 3 పెళ్లిళ్లు ? : సజ్జల రామకృష్ణారెడ్డి

పవన్ లో ఏదో లోపం ఉంది..అందుకే 3 పెళ్లిళ్లు ? : సజ్జల రామకృష్ణారెడ్డి

by Bunty
Ad

జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు.  పవన్ కళ్యాణ్ వివాహాల విషయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్లో తప్పేం ఉంది?? పీఠాధిపతిలా పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఇటువంటి ప్రశ్నలు కచ్చితంగా వస్తాయన్నారు. ఒకరితో వివాహ బంధంలో ఉండి మరోకరితో పిల్లలను కనటం పై పవన్ భార్యే తప్పు బట్టారు.

Sajjala Ramakrishna Reddy comments on pawan kalyan

Sajjala Ramakrishna Reddy comments on pawan kalyan

ప్రజా జీవితంలో ఉండి సూక్తులు చెబితే సరిపోతుందా?? అని నిలదీశారు వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల నుంచి వచ్చే ఇటువంటి ప్రశ్నలకు చచ్చినట్టు సమాధానం ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ఈ  ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో ఎందుకు నివాసం ఉండేట్లు అనటానికి సమాధానం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వరుసగా 3 పెళ్లిళ్లు చేసుకొని విడాకులు ఎందుకు తీసుకున్నావ్..నీలో ఏమైనా లోపం ఉందా ? అని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Advertisement

Advertisement

5 కేజీల బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు…మిగిలిన ఖైదీలు మనుషులు కారా?? అని పేర్కొన్నారు. అవసరం లేనన్ని సదుపాయాలను కల్పించామని.. స్నేహ బ్యారెక్ మొత్తం ఎందుకు ఖాళీ చేసి చంద్రబాబు కోసమే కేటాయించాం ? అని పేర్కొన్నారు. బరువు తగ్గారు అంటే ఆయన భార్య భోజనంలో ఏం కలుపుతున్నారో ? ఇంటి దగ్గరి నుంచి వస్తున్న భోజనంలో ఏమైనా కలిపి కొంచెం అనారోగ్యానికి గురయ్యేలా  ప్రయత్నం చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading