టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాటి ఎంగేజ్మెంట్ ఇటీవల కాలంలోనే జరిగింది. వీరిద్దరూ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ వ్యవహారాన్ని… ఇరువురి ఇంట్లో చెప్పడంతో పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెద్దలు.
ఈ తరుణంలోనే గత నాలుగు నెలల కిందట వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలా ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్ కు అల్లు కుటుంబం, మెగా కుటుంబం అలాగే లావణ్య త్రిపాఠి కుటుంబాలు హాజరయ్యాయి. లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ వివాహం డిసెంబర్ మాసంలో జరగనున్నట్లు సమాచారం అందుతోంది.
Advertisement
Advertisement
దీంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మెగా కుటుంబ సభ్యులు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన కాస్ట్యూమ్స్ సెలక్షన్, గెస్ట్ లను ఎవరిని పిలవాలి ? ఏ గెస్ట్ లకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనే అంశాలపై మెగా పెద్ద కోడలు ఉపాసనకు అప్పగించారట. ఈ నేపథ్యంలోనే లావణ్య త్రిపాఠి ధరించే దుస్తులు కూడా ఉపాసన సెలెక్ట్ చేసిందట.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లావణ్య త్రిపాఠి కాస్టింగ్ రిజెక్ట్ చేసిందట. తన పెళ్లిలో ఉపాసన పెత్తనం ఏంటి అని వరుణ్ తేజ్ తో గొడవ పెట్టుకుందట లావణ్య త్రిపాఠి. ఇక ఈ విషయం ఉపాసన వరకు వెళ్లిందని సమాచారం. దీంతో ఆ బాధ్యతలనుంచి ఉపాసన తప్పుకుందట. ఈ తరుణంలోనే పెళ్లి కాకముందే మెగా కోడల మధ్య గొడవలు ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఇవి కూడా చదవండి
- Hardik Pandya : గ్రౌండ్లోనే పాండ్యా క్షుద్ర పూజలు… వెంటనే ఔట్
- Renu Desai : గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పవన్ మాజీ భార్య
- బన్నీ సినిమా కోసం ఊర్వశి కొత్త డిమాండ్లు… కోట్లు ఇవ్వాల్సిందేనని ?