Home » Renu Desai : గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పవన్ మాజీ భార్య

Renu Desai : గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పవన్ మాజీ భార్య

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు వరుసగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒకప్పుడు సోనాలి బింద్రే, మమతా మోహన్దాస్ వంటివారు చాలా పెద్ద అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు. ఇక ఇటీవలే సమంత సైతం మయోసైటీస్ వ్యాధి బారినపడి ఇప్పుడిప్పుడే ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కోలుకుంటుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందట.

Advertisement

ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. ఇక ఆ పోస్ట్ లో రేణు దేశాయ్ తాను గుండె సంబంధిత సమస్య, మరికొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ, ఆ సమస్యకి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను అంటూ పేర్కొంది. ఎంత ప్రయత్నించినప్పటికీ తాను వ్యాధి నుంచి బయటపడలేకపోతున్నానని బాధపడింది.

Advertisement

pawan-kalyan-and-chiranjeevi-with-renudesai

ఇది ఇలా ఉండగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ విడిపోయారు. అనంతరం… పవన్ కళ్యాణ్ విదేశాలకు చెందిన ఓ అమ్మాయిని మూడవ వివాహం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading