తమిళ నటి మహాలక్ష్మి రవీందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ వివాహా అనంతరం సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక వీరికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. మహాలక్ష్మి బుల్లితెర నటి. తన అద్భుతమైన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక రవీందర్ ప్రొడ్యూసర్. ఇతను భారీకాయంతో ఉంటాడు. అయినప్పటికీ వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
వీరిపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ వారు వాటిని పట్టించుకోకుండా వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. వివాహ అనంతరం వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్ ను వివాహం చేస్కుందని అనేక వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో రవీందర్ ఒక వ్యక్తిని మోసం చేశాడని, ఆ వ్యక్తికి 15 కోట్ల రూపాయలు ఇవ్వాలని అతని స్నేహితుడు రవీందర్ పై కేసు పెట్టి అరెస్టు చేయించాడు. ఇక రవీందర్ అరెస్ట్ అనంతరం సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన మహాలక్ష్మి రవీందర్ అప్పులు, ఆస్తుల విషయాలు నాకు తెలియవు.
Advertisement
Advertisement
తాను నాకు చెప్పకుండా నన్ను మోసం చేసి వివాహం చేసుకున్నాడు అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇక రీసెంట్ గా బెయిల్ మీద బయటకు వచ్చిన రవీందర్ మీడియాతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. తన భార్య గురించి మాట్లాడుతూ మా అమ్మ తర్వాత అంతే ఇష్టమైన వ్యక్తి కేవలం నా భార్య మహాలక్ష్మి… అందరికన్నా నాకు మహాలక్ష్మి చాలా ముఖ్యం. మా ఇద్దరినీ ఎప్పటికీ విడదీయలేరు అని చెప్పుకొచ్చాడు. మీరు మా మీద ఎంత ట్రోలింగ్ చేసినప్పటికీ మేము దానిని పట్టించుకోము అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వార్త కాస్త వైరల్ గా మారుతుంది.
ఇవి కూడా చదవండి
- వైజయంతి నిర్మాతలు వార్నింగ్.. చిరంజీవికి ఇచ్చిందా..?
- Achyuth : టాలీవుడ్ సీనియర్ నటుడు అచ్యుత్ ఎలా చనిపోయాడో తెలుసా ?
- World Cup 2023 : క్రికెటర్లపై పగబట్టిన దోమలు.. డెంగ్యూ బారిన మరో దిగ్గజం !