Home » బిగ్ బాస్ కి అమర్ దీప్ పనికి రారు.. తేజస్విని సంచలన కామెంట్స్..!

బిగ్ బాస్ కి అమర్ దీప్ పనికి రారు.. తేజస్విని సంచలన కామెంట్స్..!

by Sravya
Ad

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఎప్పుడూ లేనివిధంగా ఈ సీజన్ ఉంది. ఉల్టా పూల్టా అంటూ ఈ సీజన్లో అనేక మార్పులు చేస్తున్నారు. బిగ్ బాస్ లోకి వచ్చిన వాళ్లలో అమర్ దీప్ చౌదరి కూడా ఒకరు. సీరియల్స్ ద్వారా అమర్ పాపులర్ అయ్యారు. మంచి ఫ్యాన్ బేస్ ని కూడా సంపాదించుకున్నారు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అమర్ టైటిల్ విన్నర్ అని చాలామంది అనుకున్నారు. కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఆట తీరు చూసి అందరూ అమర్ డిసప్పాయింట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ నెగిటివిటీ ఎక్కువ అయింది. నాగార్జున కూడా ఆట తీరుపై నిరాశని వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement

తాజాగా తన భర్త అమర్ గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడంతో నటి తేజస్విని సోషల్ మీడియా వేదికగా పలు విషయాలు చెప్పారు. చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయనది. అయితే చిన్న పిల్లలకి చెప్పినట్ అమర్ కి కూడా ప్రతి ఒక్క విషయం చెప్పాలి. టాస్కులలో కష్టపడే ఆడతారు అమర్. మైండ్ గేమ్స్ లో కొంచెం తడబడతారు అని తేజస్విని చెప్పారు. పైగా ఎవరేమి చెప్పినా నమ్మేస్తారని తేజస్వి చెప్పారు. 24 గంటల్లో మనకి కేవలం ఒక గంట మాత్రమే చూపిస్తారు. అయితే వీరు మంచి కాకుండా ఎక్కడైనా చెడు మాట్లాడితే వాటిని మాత్రమే మనకి ప్రోమో ద్వారా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒక గంట చూసి జడ్జ్ చేయకూడదని అమర్ భార్య చెప్పారు. ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ మధ్య అమర్ రాణించడం కష్టమేనని తేజస్విని కామెంట్స్ చేశారు.

Also read:

Visitors Are Also Reading