Home » ఫ్రిడ్జ్ నుండి దుర్వాసన వస్తోందా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి…!

ఫ్రిడ్జ్ నుండి దుర్వాసన వస్తోందా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి…!

by Sravya
Ad

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ నుండి దుర్వాసన ఒకొక్కసారి వస్తూ ఉంటుంది. ఫ్రిజ్ నుండి వాసన రాకుండా ఫ్రెష్ బాగుండాలంటే, వీటిని కచ్చితంగా పాటించండి. ఇలా చేయడం వలన ఫ్రిడ్జ్ నుండి దుర్వాసన రాకుండా ఫ్రిజ్ బాగుంటుంది. ఒక నిమ్మకాయ చెక్కని కోసి ఫ్రిజ్లో ఒక దగ్గర పెట్టండి. ఇలా చేయడం వలన ఫ్రిడ్జ్ నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది. వచ్చే వాసనని నిమ్మకాయలు పీల్చుకుంటాయి. సో ఫ్రెష్ గా ఉంటుంది.

Advertisement

Advertisement

నిమ్మకాయతో పాటుగా నారింజని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టండి. దుర్వాసనని పోగొడుతుంది. నారింజ చెక్క ని కోసేసి, ఫ్రిజ్లో పెడితే కూడా దుర్వాసన పోతుంది. ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఒక స్పూన్ బేకింగ్ సోడా వేయండి. ఫ్రిజ్లో ఒక చోట పెట్టండి. ఇలా కూడా దుర్వాసన రాకుండా చూసుకోవచ్చు. గ్రీన్ టీ కూడా ఫ్రిజ్ నుండి వచ్చే చెడు వాసనని పోగొడుతుంది. గ్రీన్ టీ బ్యాగులని ఎండలో ఆరబెట్టి వాటిని ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్ లో పెడితే దుర్వాసన రాదు. బంగాళదుంప పొట్టు తీసి ముక్కలు కింద కోసుకోండి. గిన్నెలో వేసి ఫ్రిడ్జ్ లో ఒక దగ్గర పెట్టండి, దుర్వాసన రాదు. తొక్కలని నాలుగైదు రోజులు కి ఒకసారి మారుస్తూ ఉండండి.

Also read:

Visitors Are Also Reading