రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జైల్లో నా భర్తకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు. నా భర్త క్షేమం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నానని పేర్కొన్నారు. ఆయన ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని సంచలన ఆరోపణలు చేశారు నారా భువనేశ్వరి. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెపుతున్నారని ఆగ్రహించారు.
జైల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు నారా భువనేశ్వరి. ఈ భయంకరమైన పరిస్థితులు నా భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయన్నారు. ఇక అటు నారా బ్రహ్మాణి కూడా ఇదే విషయాన్ని ఎత్తి చూపారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో ఉందని…చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు తక్షణ వైద్య సహాయం అవసరమని.. సకాలంలో సరైన వైద్యం అందడం లేదని మండిపడ్డారు.
Advertisement
Advertisement
చంద్రబాబు ఆరోగ్యంపై మాకు ఆందోళనగా ఉందన్నారు నారా బ్రహ్మాణీ. అటు చంద్రబాబు ఆరోగ్యంపై అచ్చెన్నాయుడు సంచలన కామెంట్లు చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వెల్లడి చేయకుండా ప్రభుత్వ వైద్యులపై పోలీసులు ఒత్తిడి పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు సొంత డాక్టర్లను ఇప్పటివరకు ప్రభుత్వం ఎందుకు సంప్రదించ లేదు..? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదని డాక్టర్లు చెబుతామన్నా.. వద్దని పోలీసులు ఒత్తిడి తెచ్చారని..చంద్రబాబు ఆరోగ్యంపై వాస్తవాలు చెప్పొద్దని డాక్టర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని ఫైర్ అయ్యారు. చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత డాక్టర్ల బృందాన్ని పంపాలని కోరారు అచ్చెన్నాయుడు.
ఇవి కూడా చదవండి
- God Movie Review : గాడ్ మూవీ రివ్యూ
- Samantha : ఆస్పత్రి పాలైన సమంత… ఆందోళనలో ఫ్యాన్స్ ?
- ఇండియాను రెచ్చెగొట్టేలా రిజ్వాన్ ప్రవర్తన..!