God Movie Review : సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలతో జోరు చూపిస్తోంది. ఇటివలే జవాన్ తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన నయనతార హిట్ కాంబోతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తనీ ఓరువన్ (తెలుగులో ధ్రువ) వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత జయం రవి, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుదన్ సుందరం, జి. జయరాం, సిహెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.
కథ మరియు వివరణ :
Advertisement
గాడ్ మూవీ కథ విషయానికి వస్తే. అర్జున్ (జయం రవి) అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. భయం అంటే ఏమిటో తెలియని వ్యక్తిత్వం తనది. కోపం… దూకుడు రెండు ఎక్కువే. నేరస్తుల్ని శిక్షించే క్రమంలో అవసరం అనుకుంటే చట్టాన్ని మీరడానికైనా వెనకాడడు. తన మిత్రుడు, సహోద్యోగి ఆండ్రూ (నరైన్) అంటే అర్జున్ కు చాలా ఇష్టం. అతని కుటుంబాన్ని సొంత కుటుంబంలో భావిస్తుంటాడు. వృత్తిపరంగా సాఫీగా సాగిపోతున్న వారి జీవితాలకు స్మైలింగ్ కిల్లర్ బ్రహ్మ (రాహుల్ బోస్) రూపంలో సవాలు ఎదురవుతుంది.
Advertisement
సైకో కిల్లర్ అయిన అతను నగరంలో అనేకమంది యువతుల్ని కిడ్నాప్ చేసి….వారిని అత్యంత పాశవీకంగా హ**త్యచేసి తప్పించుకు తిరుగుతుంటాడు. దీంతో అతన్ని ఆరికట్టించేందుకు అర్జున్ బృందం రంగంలోకి దిగుతుంది. అయితే బ్రహ్మను పట్టుకునే క్రమంలో అనుకోకుండా ఆండ్రు ప్రాణాలు కోల్పోతాడు. ఆ బాధలో అర్జున్ డిపార్ట్మెంట్ నుంచి తప్పుకుంటారు. కానీ బ్రహ్మ జైలు నుంచి తప్పించుకోవడంతో కథ మళ్ళీ మొదటి వస్తుంది. నగరంలో వరుస హ**త్యలు మళ్ళీ మొదలవుతాయి. ఇక దీనిపై వెనక ఎవరు ఉన్నారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో నయనతార, జయం రవి అద్భుతంగా నటించారు. దర్శకత్వం కూడా బాగానే ఉంది.
పాజిటివ్ పాయింట్స్
నయనతార
జయం రవి
సెకండ్ పార్ట్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
స్క్రీన్ ప్లే
రేటింగ్ : 2.5/5
ఇవి కూడా చదవండి
- Samantha : ఆస్పత్రి పాలైన సమంత… ఆందోళనలో ఫ్యాన్స్ ?
- ఇండియాను రెచ్చెగొట్టేలా రిజ్వాన్ ప్రవర్తన..!
- World Cup 2023 : వరల్డ్ కప్ నుంచి గిల్ అవుట్..ధావన్ కు పిలుపు ?