Home » సందీప్ ని కుక్కను కొట్టినట్టు కొట్టిన ప్రశాంత్…. మాస్టర్ జ్యోతి ఆవేదన…!

సందీప్ ని కుక్కను కొట్టినట్టు కొట్టిన ప్రశాంత్…. మాస్టర్ జ్యోతి ఆవేదన…!

by Sravya
Ad

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అనుకోని సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఎవరు ఊహించని విధంగా ఉంటోంది. ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ లో ఆట సందీప్ కూడా ఒకరు. సందీప్ భార్య జ్యోతి రాజ్ తో కలిసి పెద్ద ఎత్తున డాన్స్ వీడియోలు చేస్తూ, సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ మాస్టర్. తన స్టైల్ లో ఆడుతూ ఆకట్టుకుంటున్నారు. సాధారణంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినప్పుడు గొడవలు కామన్ గా జరుగుతూ ఉంటాయి. తోటి కంటెస్టెంట్ ల మధ్య ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అయితే కొంతమంది యూట్యూబ్ వాళ్ళు నచ్చినట్టుగా విచిత్రంగా థంబ్ నెయిల్స్ ని పెడుతూ వార్తలని వైరల్ చేస్తారు.

Advertisement

Advertisement

ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆట సందీప్ మాస్టర్ ని కుక్కను కొట్టినట్టు కొట్టిన పల్లవి ప్రశాంత్ అని హెడ్డింగ్ పెట్టి, వార్తలు రాయడంపై మాస్టర్ భార్య జ్యోతి రియాక్ట్ అయ్యారు. హౌస్ లో ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేయాలి తప్పులేదు కానీ ఒకళ్ళని సపోర్ట్ చేసి ఇంకొకళ్ళని కించపరిచేలా ఉండకూడదు అని చెప్పుకొచ్చారు. వ్యూస్ కోసం డబ్బులు కోసం ఒక వ్యక్తిని కించపరిచేలా మాట్లాడడం మంచిది కాదని.. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన హెడ్డింగ్ చూసి నాకు చాలా బాధ వేసిందని ఆమె చెప్పారు.

Also read:

Visitors Are Also Reading