చిత్ర పరిశ్రమల్లో తెలుగు, తమిళ. హిందీ ఇలా ఇండస్ట్రీ ఏదైనా విడాకుల వార్తలు మాత్రం కామన్ అయిపోయాయి. ఒకరి తరవాత మరొకరు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తూ అవాక్కయ్యేలా చేస్తున్నారు. గతేడాది బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తాను తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ వార్త అందర్నీ షాక్ కు గురిచేసింది. ఇదిలా ఉండగానే మన తెలుగు చిత్ర పరిశ్రమలో లవ్లీ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత నాగ చైతన్య తాము విడిపోతున్నామంటూ బాంబు పేల్చారు.
Advertisement
తెలుగు ప్రేక్షకులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోయారు. ఎంతో అందంగా ఉండే ఈ జంట విడిపోవడం ఏంటని షాక్ అయ్యారు. సామ్ చైతూల విడాకుల పై గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దాంతో వీరి విడాకుల వార్త టాలీవుడ్ వార్తలు ఫాలో అయ్యేవారు పెద్దగా షాక్ అవ్వలేదు. అంతే కాకుండా వీరిది నాలుగేళ్ల వివాహ బంధం కాబట్టి లైట్ అనుకున్నారు. కానీ రీసెంట్ గా తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.
Advertisement
గతంలో వీరి విడాకులపై అసలు ఎలాంటి వార్తలు వినిపించలేదు. అంతే కాకుండా ఇద్దరిదీ ప్రేమ వివాహం. వీరి పెళ్లై ఏకంగా పద్దెనిమిదేళ్లు అవుతోంది. అయితే చై సామ్ లవ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులకు తెలుసు గానీ ధనుష్ ఐశ్ ల లవ్ స్టోరీ పెద్దగా తెలియదు. 2004లో వీరి వివాహం కుటుంబ సభ్యుల మధ్యన జరిగింది. ధనుష్ హీరోగా నటించిన కాదల్ కొండై విడుదలైనప్పుడు చిత్రయూనట్ ద్వారా ఐశ్వర్య ధనుష్ కు పరిచయమైంది.
సినిమా భాగా నచ్చడంతో బొకే ఇంటికి పంపి టచ్ లో ఉండమని చెప్పింది. ఇక ధనుష్ వరుస సినిమాల కారణంగా పెద్దగా పట్టించుకోలేదట. ఆ తరవాత వీరి స్నేహం కంటిన్యూ కాగా మీడియాలో ప్రేమలో ఉన్నట్టు కథనాలు వచ్చాయట. ఆ తరవాత ఇద్దరూ నిజంగానే ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టు తెలుసుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. ఈ విషయాన్ని ధనుష్ గతంలో ఓ మీడియా ఛానల్ ద్వారా తెలిపారు.