ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ప్రారంభ మ్యాచ్‌ని చూడటానికి క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం అక్టోబర్ 8న MA చిదంబరం స్టేడియంకు వెళ్ళవచ్చు. అయితే.. అందరు మ్యాచ్ చూసే ముందు టీం ఇండియా జెర్సీలను ధరించి టీం ఇండియాను ఉత్సాహంలో ముంచెత్తుతూ ఉంటారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా ఈ బ్యాండ్‌వాగన్‌లో చేరనున్నారు. ఈ విషయాన్నీ ఆయన తన ట్విట్టర్ (ప్రస్తుతం X) ద్వారా ప్రకటించారు.
Advertisement
RPG ఛైర్మన్ తన అనుకూలీకరించిన జెర్సీని 55 నంబర్‌తో సోషల్ మీడియా ద్వారా చూపారు. ఈ పోస్ట్ కు “ఐయామ్ రెడీ” అన్న టాగ్ ను కూడా జత చేసారు. ఆయన క్రికెట్ అభిమానుడు అని అందరికి తెలిసిన విషయమే. అయితే.. చాలా మందికి అర్ధం కానీ విషయం ఏమిటంటే.. ఆయన తన జెర్సీ పై 55 నెంబర్ ను మాత్రమే ఎందుకు ముద్రించుకున్నారు? దీని వెనక కారణం ఏంటి అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఇంతకీ ఆ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఇంతకీ ఆనంద్ మహీంద్రా ఈ నెంబర్ ను ముద్రించడానికి కారణం చాలా సింపుల్. ఈ నెంబర్ ఆయన పుట్టినరోజుకు సంబంధించినది. అయితే ఆయన ఈ విషయం ముందుగా చెప్పకుండా ఆయన తన అభిమానులను చెప్పాలని కోరారు. ఎవరు సమాధానం ఇస్తారో అని ఎదురు చూసారు. ఓ అభిమాని చాల సింపుల్ గా సమాధానం చెప్పేసారు. “ఆనంద్ సర్ పుట్టిన తేదీ 1 మే 1955. అందుకే ఆయన తన జెర్సీ పై ఈ నెంబర్ ను ముద్రించుకున్నారు” అంటూ కామెంట్ చేసాడు. కేవలం పుట్టిన రోజు అని మాత్రమే కాదు. ఐదవ సంఖ్యా ఆనంద్ మహీంద్రాకు లక్కీ నెంబర్ అట. అందుకే ఆయన ఆ నెంబర్ నే జెర్సీ పై ముద్రించుకున్నారట.
మరిన్ని..
ఈ సైకిల్ మెకానిక్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు.. ఇతని సక్సెస్ స్టోరీ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!
నవరాత్రులు మొదలయ్యే సరికి ఇంట్లోంచి ఈ వస్తువులను కచ్చితంగా బయటపడేయండి.. ఎందుకంటే?
ఉప్పు తినడం తగ్గించారా? దీని వలన కలిగే 6 సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసుకోండి!