Home » Mama Mascheendra Review : “మామా మశ్చీంద్ర” రివ్యూ.. సుధీర్ హిట్టు కొట్టినట్లేనా ?

Mama Mascheendra Review : “మామా మశ్చీంద్ర” రివ్యూ.. సుధీర్ హిట్టు కొట్టినట్లేనా ?

by Bunty
Ad

Mama Mascheendra Review : హిట్ కోసం ఎప్పటినుండో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోలలో సుదీర్ బాబు ఒకరు. సుధీర్ బాబు నటించిన లాస్ట్ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా భారీగా నిరాశపరిచి డిజాస్టర్ గా నిలిచిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కొత్త సినిమాతో వస్తున్నాడు. మామ మశ్చీంద్ర అంటూ డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.

Mama Mascheendra Review

Mama Mascheendra Review

కథ మరియు వివరణ :

Advertisement

మామ మశ్చీంద్ర సినిమా కథ విషయానికి వస్తే.. పరశురామ్ (సుధీర్ బాబు) బాల్యంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా రాతి మనిషిలా మారతాడు. వందల కోట్ల ఆస్తి కోసం సొంత మనుషులను సైతం చంపడానికి వెనుకాడడు. చెల్లెలు, ఆమె భర్తతో పాటు పిల్లల్ని చంపమని తన మనిషి దాసు (హర్షవర్ధన్)ను పంపిస్తాడు. అయితే వాళ్ళు తప్పించుకుంటారు. కట్ చేస్తే కొన్నాళ్లకు పరశురామ్ కుమార్తె విశాలాక్షి (ఈషా రెబ్బ), విశాఖలో రౌడీ దర్గా (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన దాసు కుమార్తె మీనాక్షి (మృణాళిని రవి), ఫేమస్ డీజే (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు.

Advertisement

ఈ విషయం తెలిసి…తన పోలికలతో జన్మించిన మేనల్లుళ్లు పగ తీర్చుకోవాలని ఇలా ప్రేమ పేరుతో కొత్త నాటకానికి తెరతీసారేమోనని పరశురామ్ అనుమానిస్తారు. అది నిజమా? లేదంటే అతడి ఊహ మాత్రమేనా? పరశురామ్ మీద హత్యాయత్నం చేసింది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావమరిదిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుధీర్ బాబు మొదటినుండి కాస్త డిఫరెంట్ కథలనే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడు. ఎప్పుడు కమర్షియల్ సినిమాలే కాకుండా పాత్ర ప్రధానమైన సినిమాలు, ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంటాడు. ఇక అలాంటి ప్రయోగాల్లో వచ్చిన సినిమానే మామ మశ్చీంద్ర.

ప్లస్‌ పాయింట్స్‌

సుధీర్‌
కామెడీ

మైనస్‌ పాయింట్‌

దర్శకత్వం
రొటీన్‌ సీన్స్‌

రేటింగ్‌ 2/5

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading