Rules Ranjan movie review: రూల్స్ రంజన్ మూవీ రివ్యూ ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపును అందుకుంటున్న వారిలో కిరణ్ అబ్బవరం ఉంటాడు అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో అతను ఎక్కువగా బిగ్ ప్రొడక్షన్ హౌస్‌లలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కంటెంట్ సినిమాలను ట్రై చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, మాస్ సినిమాలను కూడా ట్రై చేస్తున్నాడు. రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కాంబోలో ఒక ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ రూల్స్ రంజన్ అని టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.
కథ మరియు వివరణ :
Advertisement
రూల్స్ రంజన్ మూవీ కథ విషయానికి వస్తే… మనోరంజన్ (కిరణ్ అబ్బవరం) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ గా పని చేస్తూ ఉంటాడు. అతనికి ముంబై ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడికి వెళ్తాడు. అక్కడ బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ అయిన వెన్నెల కిషోర్ రూమ్ లో ఉంటాడు. ఇక తన జీవితం మొత్తం స్ట్రిక్ట్ రూల్స్ తో పని చేసుకుంటూ బ్రతికేస్తూ ఉంటాడు. అలాంటి మనోరంజన్ కి తన పాత స్నేహితురాలు అయిన సన నేహా (శెట్టి) పరిచయం అవుతుంది. స్లోగా సనకి దగ్గర అవుతాడు మనోరంజన్. తనకోసం రూల్స్ బ్రేక్ చేసి మరి పబ్ కి వెళుతూ ఉంటాడు. అయితే మనోరంజన్ సనని ప్రేమించడం మొదలుపెడతాడు. కానీ తనకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి మనోరంజన్ ఏం చేశాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి.
Advertisement
కిరణ్ అబ్బవరం అన్ని సినిమాల్లో ఒకేలాగా నటిస్తుంటాడు అనే టాక్ ఉంది. అయితే ఈ సినిమాలో లుక్ అయితే మార్చాడు కానీ నటన మాత్రం అలాగే ఉంది. మనోరంజన్ పాత్ర తనకి ఏమాత్రం సవాలు విసిరాడు. నేహా శెట్టి కూడా అంతగా ఆకట్టుకోదు. ఇక సుబ్బరాజు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ మరియు తన పాత్రకి తాను న్యాయం చేశాడు కూడా. ఇక హైపర్ ఆది, వెన్నెల కిషోర్, వైవా హర్ష తమ పాత్రల మేరకు బాగా చేశారు.
ప్లస్ పాయింట్లు :
నేహశెట్టి, కిరణ్
కామెడీ
మైనస్ పాయింట్లు :
కథ
దర్శకత్వం
సినిమా రేటింగ్ : 2.75/5
ఇవి కూడా చదవండి
- రామ్పోతినేని – అనుపమ పరమేశ్వరన్ ప్రేమ, పెళ్లి ?
- అక్కినేని కుటుంబానికి షాక్..సమంత జీవితంలోకి మరో నాగచైతన్య?
- NTR ను వెన్నుపోటు పొడవటంలో నారా భువనేశ్వరి పాత్ర ?