కొన్నిసార్లు అనుకోకుండా జరిగిన సంఘటనలు పలు అనుమానాలకు దారి తీస్తుంటాయి. ఆ సంఘటన జరగడానికి అనేక కారణాలు ఉన్నా కానీ సిల్లీ రీజన్స్ తెరపైకి వస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక రీజనే స్టార్ కపుల్ ధనుష్ ఐశ్వర్య విడిపోవడానికి కారణం అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరియు అల్లుడు ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్టు గా గత రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.
దాంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేకుండా ఇద్దరు సడన్ గా ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని షాక్ అయ్యారు. ఇక ప్రస్తుతం వీళ్ళ విడాకుల అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటే ఐశ్వర్య విడాకులపై కొన్ని ఆసక్తికర మీమ్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత నాగచైతన్య కూడా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం వీరిద్దరూ విడిపోయారు. ఇక ఐశ్వర్య ధనుష్ ఏకంగా 18 ఏళ్ళు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండి సడన్ గా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే వీరిద్దరి విడాకుల మధ్య ఒక కోఇన్సిడెన్స్ ఉంది…అదేంటి అంటే శేకర్ కమ్ములతో నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలోనే సమంత నాగ చైతన్య విడిపోయారు. సినిమా విడుదల నాటికి ఇద్దరు విడాకులు కూడా తీసుకున్నట్టు ప్రకటించారు.
అయితే ధనుష్ కూడా ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడు ధనుష్ ఐశ్వర్య లు విడిపోయారు. దాంతో శేఖర్ కమ్ముల తో సినిమాలు చేసినప్పుడే ఇద్దరు హీరోలు విడాకులను ప్రకటించారు ఇదెక్కడి కోయిన్సిడెన్స్ అంటూ మీమ్స్ వస్తున్నాయి.