Home » ఫోటో వెనుక క‌థ‌నం- జ‌య‌ల‌లిత చేసిన‌ శ‌ప‌థం.!

ఫోటో వెనుక క‌థ‌నం- జ‌య‌ల‌లిత చేసిన‌ శ‌ప‌థం.!

by Azhar
Ad

1989లో త‌మిళ‌నాడు CM గా ఉన్న‌ క‌రుణానిధి అసెంబ్లీలో బ‌డ్జెట్ ప్ర‌సంగం చేస్తున్నారు. అప్ప‌టి శాస‌న‌స‌భా ప్ర‌తిపక్ష‌నేత అయిన జ‌య‌ల‌లిత మీవ‌న్నీ త‌ప్పుడు హ‌మీలు..కాగిత‌పు లెక్క‌లంటూ ఆ ప్ర‌సంగాన్ని అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన DMK పార్టీ నేత‌లు జ‌య‌ల‌లిత‌వైపు దూసుకువ‌చ్చారు, తోపులాట జ‌రిగింది. ఈ తోపులాట‌లో జ‌య‌ల‌లిత చీర చినిగిపోయింది. ( DMK సీనియర్ నాయకుడు దురై మురుగన్ జయలలిత జుట్టుపట్టుకున్నాడ‌ని, చీరలాగే ప్ర‌య‌త్నం చేశాడ‌నే ఆరోపణలు వచ్చాయి)

 

 

చినిగిన చీర‌తో, చెదిరిన జుట్టుతో అసెంబ్లీని వీడుతూ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగానే ఈ స‌భ‌లో అడుగుపెడ‌తాన‌ని జ‌య‌ల‌లిత శ‌ప‌థం చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన‌ ఏ అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌య‌ల‌లిత హాజ‌రు కాలేదు.

Advertisement

Advertisement

1991లో శాంతిభద్రతలను పరిరక్షించడంలో త‌మిళ‌నాడు స‌ర్కార్ విఫలమైందని కేంద్రం కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో జ‌య‌ల‌లిత నాయ‌క‌త్వంలోని ‌ AIADMK పార్టీ 234 సీట్ల‌లో 225 సీట్ల‌ను గెలిచి అధికారంలోకి వ‌చ్చింది. జ‌య‌ల‌లిత CM అయ్యారు. త‌న శ‌ప‌థం ప్ర‌కారం CMగానే త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ‌లో అడుగుపెట్టారు.చివరికి జయలలిత చీర లాగారనే ఆరోపణలు ఎదుర్కొన్న దురై మురుగన్ రాజకీయ జీవితం అంతం అయ్యింది.

Visitors Are Also Reading