టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమందికి మాత్రమే స్టార్ డం వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఫోక్ సింగర్స్ కు ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అలా ఓ టీవీ ఛానల్లో పనిచేసి సింగర్ మంగ్లీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
సింగర్ మంగ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలంగాణలో పుట్టి పెరిగిన సింగర్ మంగ్లీ… ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సింగర్ గా మారిపోయింది. తన కెరీర్ ప్రారంభంలో ఓ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పనిచేసిన సింగర్ మంగ్లీ ఆ తర్వాత… బతుకమ్మ, సమ్మక్క సారక్క, పొలిటికల్ సాంగ్స్ పాడి పాపులర్ అయింది. ఇక ప్రస్తుతం ప్రతి సినిమాలో…. మాస్ సాంగ్స్ పాడుతూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటుంది సింగర్ మంగ్లీ.
Advertisement
Advertisement
అయితే తాజాగా సింగర్ మంగ్లీ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సింగర్ మంగ్లీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సమాచారం అందుతుంది. తన సొంత బావను సింగర్ మంగ్లీ పెళ్లి చేసుకుంటుందట. దీంతో సింగర్ మంగ్లీ కి ఆమె ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా… సింగర్ మంగ్లీ చెల్లెలు, దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నారని మొన్నటి వరకు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- Naa Saamiranga Movie : నా సామిరంగా సినిమా కోసం ఇద్దరు భామలు..!
- World Cup 2023 : వరల్డ్ కప్ మ్యాచ్లకు భారీ షాక్..రోజూ వర్షాలే ?
- Singer Damini : నాకింకా పెళ్లి కాలేదు.. సహజీవనం చేస్తా !