అందాల తార కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ గా ఈమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీలో దూసుకుపోయే మనస్తత్వమే ఆమెను ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చింది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కంగానా మొదటి స్థానంలో నిలిచింది.
Advertisement
ఈమె తరచూ వివాదాస్పద వాక్యాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈమె మరోసారి తాజాగా వార్తల్లోకి ఎక్కింది. కంగానా వివాహం చేసుకోబోతుందట. ఓ వ్యక్తితో ప్రేమలో పడిందట కంగానా. ఆ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధమైందట. ఈ విషయం తెలిసిన చాలామంది వరుడు ఎవరు అని ఆరా తీస్తున్నారు. ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో వివాహం చేసుకోవడానికి కంగానా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి సిద్ధమయ్యారట.
Advertisement
ఇక వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది కంగనా. ఈ విషయాన్ని కంగానా ప్రకటించినప్పటికీ ప్రముఖ క్రికెటర్ కెఆర్కె ట్విట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన చాలామంది కంగానా వివాహబంధంలోకి అడుగుపెట్టనుందని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ట్వీట్ లో కెఆర్కె అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ డే కంగానాజీ అంటూ రాసుకొచ్చాడు. దీంతో కంగానా అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు.