వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ మన దేశంలో జరుగనున్న సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వ తేదీ వరకు జరుగనుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత… వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ మన దేశం జరుగుతోంది. ఈ తరుణంలో… వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో పాల్గొనే భారత్, ఆసీస్ మినహా జట్లు అన్ని ఇండియాకు బయలు దేరాయి. అటు పాకిస్థాన్ జట్లు నేరుగా హైదరాబాద్ కు రావాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలోనే… పాకిస్థాన్ జట్టుకు… వీసా సమస్య వచ్చింది.
Advertisement
షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ జట్టు ఈనెల 26వ తేదీన హైదరాబాద్కు రావాల్సి ఉండేది. కానీ పాకిస్తాన్ జట్టుకు వీసా సమస్య అంతలెత్తింది. దీంతో పాకిస్తాన్ జట్టు సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి హైదరాబాద్ కు చేరుకోనుంది. పాకిస్తాన్ జట్టుకు వీసా సమస్య తలెత్తడంపై మొదట బీసీసీఐకి పాకిస్తాన్ బోర్డు లేఖ రాసింది. కానీ స్పందన లేకపోవడంతో… నేరుగా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే పాక్ జట్టుకు వీసాలు జారీ చేసింది బీసీసీఐ.
Advertisement
వాస్తవానికి PRC దేశాలు అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్తాన్, సూడాన్, పాకిస్థానీ మూలాలున్న విదేశీయులు మాత్రమే వరల్డ్ కప్ కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవడం అవసరం” అని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. కానీ ఆ పర్మిషన్ మొదట పాకిస్తాన్ తీసుకోలేదట. అందుకే వీసాలు ఆపేసింది బీసీసీఐ. ఐసీసీ చెప్పడంతో.. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకుంది పాక్. దాంతో వీసాలు మంజూరు అయ్యాయి. ఇక ఇవాళ రాత్రి హైదరాబాద్ కు పాక్ జట్టు రానుంది.
ఇవి కూడా చదవండి
- వరల్డ్ కప్ టీంలోకి అశ్విన్.. అక్షర్ పటేల్ ఔట్ !
- హీరోయిన్ రాశి, వేణు మధ్య అలాంటి రిలేషన్ ఉందా..?
- కలర్స్ స్వాతి తో నవీన్ చంద్ర పెళ్లి.. ఇందులో నిజమెంత..?