ప్రముఖ సినీ నిర్మాత అశ్వినిదత్ ఏపీ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి 160 సీట్లు సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు లాంటి మహానాయకుడిని జైల్లో పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. మహా నాయకుడునీ జైల్లో పెడతారని ఎవరైనా ఊహిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రసేన సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్టుపై సిని ప్రముఖులు స్పందించకపోవడంపై మీడియా ప్రముఖులు ప్రశ్నించగా, ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు కోసం తెలుగు సినిమారంగం నుంచి తాము వచ్చామని, రాని వారి గురించి వదిలేయండి అని చెప్పారు. సినీ రంగంలో తాము మాత్రమే ఉన్నామని అనుకోండని వాక్యానించారు. భువనేశ్వరి ఎన్టీఆర్ బిడ్డ అని, బ్రాహ్మణి ఎన్టీఆర్ మనవరాలని వారు ధైర్యంగానే ఉన్నారని తెలిపారు. చంద్రబాబు జనసేనను ఉద్దేశించి చంద్రసేనగా వ్యాఖ్యానించిన అశ్విని దత్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రజలు 2024లో ప్రజలు గొప్ప చరిత్రను చూడబోతున్నారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ జనసేన పార్టీ నాయకులతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎలాంటి గొడవలకు వెళ్ళొద్దని, మూడు నెలలు కష్టపడి పనిచేస్తే అన్ని మంచి రోజులే వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబునాయుడు అవసరం ఉందని, ఓటు ద్వారా నిర్ణయించాలని అన్నారు. చంద్రబాబు ఏ నేరం చేశారని జైల్లో పెట్టారని, నటుడు మురళీమోహన్ ప్రశ్నించారు. చంద్రబాబును చూస్తే చాలా బాధగా ఉందని, ఆయన గ్రహణం పోయి త్వరలోనే బయటకు వస్తారన అన్నారు. కనీస వసతులు కూడా లేకుండా చంద్రబాబును ఖైదీల మధ్య జైల్లో ఉంచారని అన్నారు.
ఇవి కూడా చదవండి
- పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలు ఎందుకు ఆలస్యం అయ్యాయి..ఇండియా కావాలనే చేసిందా ?
- హీరోయిన్ రాశి, వేణు మధ్య అలాంటి రిలేషన్ ఉందా..?
- కలర్స్ స్వాతి తో నవీన్ చంద్ర పెళ్లి.. ఇందులో నిజమెంత..?