టీమిండియా స్టార్ స్పిన్నర్, సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కు బంపర్ ఆఫర్ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడడంతో… అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఫైనల్ అవుతారని తాజాగా రోహిత్ శర్మ చేసిన కామెంట్లను బట్టి అర్థమవుతుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ వచ్చేనెల అంటే అక్టోబర్ ఐదో తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
దాదాపు పది సంవత్సరాల తర్వాత మన ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. దీంతో ఇప్పటికే 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించేసింది బీసీసీఐ పాలకమండలి. అయితే బీసీసీఐ ప్రకటించిన లిస్టులో ఉన్నటువంటి ఆల్ రౌండర్ అక్షర పటేల్ ఇటీవల గాయపడ్డాడు. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కు కూడా దూరమయ్యాడు అక్షర్ పటేల్.
ఇవాళ జరిగే మూడో వన్డే కి కూడా అక్షర్ పటేల్ సిద్ధం కాలేదు.
Advertisement
Advertisement
ఇక మరో ఎనిమిది రోజుల్లోనే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అయినప్పటికీ అక్షర్ పటేల్ కోలుకో లేడని… సమాచారం అందుతోంది. ఇలాంటి తరుణంలో ఆసీస్ జట్టుపై చేసిన అశ్విన్ బౌలింగ్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్ కప్ కు ముందు టీమిండియా కు మంచి అవకాశాలు ఉన్నాయి… బ్యాకప్ ప్లేయర్లు కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నారు… ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్ బాగా వేస్తున్నాడు అని రోహిత్ శర్మ కొనియాడాడు. దీంతో అశ్విన్ ప్రపంచ కప్ జట్టులోకి వస్తాడని అందరూ అంటున్నారు. కాగా ప్రస్తుతం అక్షర్ పటేల్… బెంగళూరు అకాడమీలో కోలుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి
- హీరోయిన్ రాశి, వేణు మధ్య అలాంటి రిలేషన్ ఉందా..?
- కలర్స్ స్వాతి తో నవీన్ చంద్ర పెళ్లి.. ఇందులో నిజమెంత..?
- ఇండియాలోనే వరల్డ్ కప్ 2023..BCCIకి 2200 కోట్ల లాభం !