130 సంవత్సరాల క్రితం లీబర్ బ్రదర్స్ అనే ఇంగ్లాండ్ కు చెందిన కంపెనీ తొలిసారిగా సబ్బును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నార్త్ వెస్ట్ సోప్ అనే కంపెనీ 1897లో మీరట్‌లో సబ్బుల కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. మరి ఈ కంపెనీల సబ్బులు రాకముందు మనవాళ్లు బట్టలు ఎలా ఉతికేవారు? స్నానాలు ఎలా చేసేవారు? తమ బట్టల, శరీరాల మురికిని ఎలా వదిలించుకునేవారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
బట్టలుతకడం కోసం :
సబ్బుల కంటే ముందు బట్టలుతకడం కోసం కుంకుడు కాయల రసం ఉపయోగించేవారు. రాజులు , ధనవంతులు తమ ఇండ్లలో కుంకుడు చెట్లను పెంచేవారు. కుంకుడు కాయల రసాన్ని ఉపయోగించి దానితో నురుగొచ్చేలా చేసి ఆ నురుగుతో తమ ఖరీదైన బట్టలను ఉతికించేవారు.
Advertisement
Advertisement
సామాన్యులు బట్టులుతికే విధానం :
సాధారణ జనాలు బట్టలుతకడం కోసం వేడినీళ్లు వాడేవారు. మురికి బట్టలను వేడినీళ్లలో వేసి అనంతరం రాళ్లతో బాదుతూ ఉతికేవారు. తర్వాతి రోజుల్లో పొలాల్లో, నదుల్లో దొరికే తెల్లటి మట్టితో కూడా బట్టలుతికేవారు. ఆ రోజుల్లో కుంకుడు కాయలు ధనవంతులకే పరిమితం.
ఇసుక + రెహ్ అనే ఖనిజం :
అప్పట్లో బట్టలను ఇసుకతో కూడా ఉతికేవారు. ఇసుకతో పాటు రెహ్ అనే ఒక రకమైన ఖనిజాన్ని వాడేవారు. దీనిలో సోడియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ మరియు కాల్షియం సల్ఫేట్ ఉంటాయి ఇవి బట్టకు అంటిన మురికిని తొలగిస్తాయి.
స్నానం చేయడానికి మట్టి:
సబ్బు రాకముందు బురద మరియు బూడిదను శరీరంపై పూసుకుని స్నానం చేసేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పాత్రలను శుభ్రం చేయడానికి బూడిదను ఉపయోగిస్తారు.