తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా… తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారు ఏపీ సిఐడి పోలీసులు. దాదాపు 18 రోజులుగా జైలు జీవితాన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు.
Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటంతో… పార్టీ కార్యకర్తలు మరియు నేతలు అందరూ తీవ్ర గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ అగ్రనేత అయిన నారా లోకేష్ ను టార్గెట్ చేశారు ఏపీ సిఐడి పోలీసులు. తాజాగా మరో స్కామ్ లో నారా లోకేష్ పేరును తెరపైకి తీసుకువచ్చింది ఏపీ సి ఐ డి.
Advertisement
తాజాగా అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు కేసులో నారా లోకేష్ పేరును తెరపైకి వచ్చింది. ఇందులో A14 గా నారా లోకేష్ పేరును చేర్చింది సీఐడీ. ఇవాళ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది ఏపీ సీఐడీ. ఇదే కేసులో A1 గా ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ కోసం హై కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు కేసులో A14 గా నారా లోకేష్ పేరును చేర్చింది సీఐడీ. దీంతో తెలుగు దేశం పార్టీ లో తీవ్ర అలజడి చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఒకవేళ నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తే ఎలా అని ఆందోళన చెందుతున్నారు కార్యకర్తలు.
ఇవి కూడా చదవండి
- జడేజాపై చేయి చేసుకున్న వార్నర్… BJP నేత సీరియస్ !
- చిరంజీవి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో.. 650 కోట్ల నష్టం ?
- Priyamani : నా వయసు 38..అయినా నన్ను ఆంటీ అని పిలవండి !