భార్య భర్తలు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. భార్య భర్తల మధ్య ఒక్కొక్కసారి గొడవలు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు గొడవలు వచ్చినా సర్దుకుంటూ పోతేనే భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది. లేదంటే వాళ్ళ మధ్య గొడవలు బాగా ఎక్కువ అవుతాయి అయితే భార్యాభర్తలు ఒకరితో ఒకరు సంతోషంగా గడపాలని అనుకుంటే రాత్రిపూట ఈ విషయాలని కచ్చితంగా పాటించాలి.. ఎక్కువ సేపు స్క్రీన్ వైపు చూడకూడదు చాలా మంది భార్యాభర్తలు మొబైల్ టీవీ కి ఎడిక్ట్ అయిపోయి ఉన్న సమయాన్ని వాటి కోసమే వెచ్చిస్తూ ఉంటారు.
Advertisement
Advertisement
దాంతో ఒకరితో ఒకరు సమయాన్ని గడపరు. రోజంతా కూడా ఎన్నో పనులు చేసి అలసిపోతూ ఉంటారు. భార్య భర్తలు రోజు చివర్లో మీ మనసులో ఏముంది అనేది మీ భాగస్వామితో పంచుకోవాలి. పడుకునే ముందు మీరు ప్రేమగా మాట్లాడుకోవాలి. పాత సంబంధాలు జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉండాలి. అద్భుతమైన క్షణాల గురించి మాట్లాడుకోవాలి. శారీరక సాన్నిహిత్యం కూడా ముఖ్యం. అలానే మీరు ఎంత ప్రేమిస్తున్నారనేది వ్యక్తపరచండి. ఈరోజు ఎలా సాగింది అనేది మాట్లాడుకోండి. ముఖ్యమైన విషయాలని మాట్లాడుకోండి. ఇలా భార్యాభర్తలు రాత్రిపూట సమయాన్ని ఈ విధంగా గడపడం వలన వాళ్ళ మధ్య ప్రేమ బాగా పెరుగుతుంది. సంతోషంగా ఉండగలరు.
Also read:
- చాణక్య నీతి: ఈ అలవాట్లు వద్దు.. సంపద పెరగదు.. మానుకోండి…!
- ఈ ఆహారపదార్దాలతో.. మీ జ్ఞాపక శక్తిని పెంచేసుకోవచ్చు…!
- మీరు మీ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయారా..? ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..!