2023 ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. మరో రెండు వారాల్లో సొంత గడ్డపై ప్రపంచకప్ సంగ్రామం మొదలు కాబోతుంది. ఇందుకోసం ఆయా జట్లు ఎదురు చూస్తున్నాయి. గేటు తెరవడమే ఆలస్యం పోరుకు సై అంటూ సంకేతాలు ఇస్తున్నాయి. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్ని జరగనుంది. వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు సరికొత్త జెర్సీలతో బరిలోకి దిగుతాయి. అలాగే టీమిండియా సైతం వరల్డ్ కప్ కోసం ప్రత్యేక జెర్సీతో కనిపించనుంది. టీమిండియా జెర్సీ స్పాన్సర్ అడిడాస్ వరల్డ్ కప్ కోసం ప్రత్యేకమైన జెర్సీని రూపొందించింది.
మెగా టోర్నీలో టీమిండియా ఆటగాళ్లు ధరించబోయే జెర్సీని అడిడాస్ వీడియో రూపంలో విడుదల చేసింది. మన జాతీయ జెండాలోని మూడు రంగులను తీమ్ గా తీసుకుంటూ త్రీ కార్డ్ డ్రీమ్ కాన్సెప్ట్ తో జెర్సీని తయారుచేసింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కింగ్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్ తో పాటు పలువురు ఆటగాళ్లు కొత్త జెర్సీతో కనిపించారు. పాత జెర్సీతో పోల్చితే ప్రపంచ కప్ జెర్సీలో చిన్న చిన్న మార్పులు చేశారు. షోల్డర్స్ పై కనిపించే మూడు అడ్డగీతలు తెలుపు రంగులో ఉండేవి ఇప్పుడు ఆ స్థానంలో త్రివర్ణ పథకంలోని మూడు రంగులను చేర్చారు. టీం లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుకు కుదించారు.
Advertisement
Advertisement
ఈ రెండు నక్షత్రాల అర్థం ఏంటంటే భారత్ రెండుసార్లు ప్రపంచకప్ గెలిచింది. వాటికి గుర్తుగా రెండు స్టార్స్ ను మాత్రమే ఉంచారు. ఇదిలా ఉండగా కొత్త జెర్సీపై క్రికెట్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగాటోర్నీ విషయానికి వస్తే వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు తొలి మ్యాచ్ అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. దీని తర్వాత అక్టోబర్ 11న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో, ఆఫ్ఘనిస్తాన్ తో 2వ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత జట్టు పాకిస్థాన్ తో 3వ మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తో టీమిండియా గ్రూప్ దశ మ్యాచ్ ను ఆడనుంది.
ఇవి కూడా చదవండి
- Salaar : ప్రభాస్ ‘సలార్’లో త్రిష, ఐశ్వర్య రాయ్.. ఏందయ్యా ఇది!
- Nara Brahmani : చంద్రబాబు అరెస్ట్….పాదయాత్రకు సిద్దమైన బ్రహ్మణి ?
- చంద్రబాబు అరెస్ట్ పై “సి ఓటర్ సర్వే” సంచలనం… ఆ పార్టీకి షాక్ తప్పదా ?