ఆసియా కప్ 2023 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు కౌన్ డౌన్ షురూ అయింది. రేపు శ్రీలంకలోని కొలంబో ప్రేమ దాస స్టేడియంలో ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరగనుంది. భారత కాలమాన ప్రకారం… రేపు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
అయితే ఇండియా వర్సెస్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షపు ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఒకవేళ వర్షం కురిస్తే రిజర్వుడే నాడు నిర్వహించనున్నారు. అంటే సోమవారం రోజున ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగనుంది అన్నమాట. ఇక రిజర్వుడే రోజు కూడా వర్షం పడితే మ్యాచ్ ను రద్దు చేసి ఇరుజట్లను విజేతగా ప్రకటిస్తారు. 2002 సంవత్సరంలో కూడా ఇలాగే వర్షం పడి… ఇరుజట్లు విజేతగా నిలిచాయి.
Advertisement
Advertisement
మరి ఆసియా కప్ 2023 టోర్నమెంట్ ఎలా ముగుస్తుందో చూడాలి. కాగా రేపటి మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. అలాగే రేపటి మ్యాచ్ లో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రేపటి ఫైనల్ మ్యాచ్కు దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
- ఆస్ట్రేలియాతో భారత్ క్రికెట్ సిరీస్..ఉచితంగా లైవ్ టెలికాస్ట్
- Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ కు మళ్ళీ గాయం…. వరల్డ్ కప్ కు దూరం !
- NTRకు వెన్నుపోటు పొడిచిoది కూడా ప్రజల కోసమేనా అమ్మా? – చంద్రబాబు భార్యపై పోసాని సెటైర్లు