Home » Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ కు మళ్ళీ గాయం…. వరల్డ్ కప్ కు దూరం !

Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ కు మళ్ళీ గాయం…. వరల్డ్ కప్ కు దూరం !

by Bunty
Ad

మొన్నటి వరకు వెన్ను గాయంతో ఇబ్బంది పడ్డాడు శ్రేయస్ అయ్యర్. సర్జరీ కూడా చేయించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రికవరీ అయ్యాడు. సూపర్ ఫిట్ అని ఎన్సీఏ అధికారులు సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. కానీ సీన్ కట్ చేస్తే శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆసియాకప్ లో పాకిస్థాన్ తో గ్రూప్ ఫోర్ మ్యాచ్ కు దూరంగా ఉన్నారు. రీఎంట్రీ ఇచ్చాక అయ్యర్ రెండు మ్యాచ్లులే ఆడాడు. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ పై పెద్దగా రాణించింది ఏమీ లేదు. ఆ తర్వాత నేపాల్ తో శ్రేయస్ కు ఆడే అవకాశమే రాలేదు.

 

shreyas iyer out from world cup 2023

shreyas iyer out from world cup 2023

సూపర్ ఫోర్ స్టేజిలో పాక్ తో కీలకమైన మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో శ్రేయస్ ఫిట్నెస్ పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జట్టుకు అయ్యర్ దూరమైతే ఎలా అని టెన్షన్ పడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ కు ముందు ఈ ట్రబుల్స్ ఏంటి శ్రేయస్ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. నిజానికి టీమిండియాకు నెంబర్ 4 పోసిషన్ చాలా కీలకం. అలాంటి నెంబర్ 4 పొజిషన్ లో శ్రేయస్ లేకపోతే ఎలా అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. యువ ప్లేయర్ గాయంపై బీసీసీఐ వర్గాల నుంచి ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. కానీ గాయం తీవ్రమైనది అయితే మాత్రం వరల్డ్ కప్ కు అయ్యర్ అందుబాటులో ఉండేది మాత్రం అనుమానమే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. శ్రేయస్ ను గాయాలు వెంటాడుతున్నాయని చెబుతున్నారు.

Advertisement

Advertisement

ఓ దశలో ఫ్యూచర్ కెప్టెన్ గా కితాబులు అందుకున్నాడని గుర్తు చేస్తున్నారు. కెప్టెన్సీ సంగతి పక్కన పెడితే అసలు గాయాల కారణంగా మ్యాచ్ ఆడే పరిస్థితి లేదంటున్నారు. ఫిట్నెస్ సమస్యల నుంచి బయటపడకపోతే అయ్యర్ కెరియర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే గాయాల కారణంగా ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు కెప్టెన్సీకి దూరమయ్యాడు. ఈ ఏడాది కోల్కత్తా నైట్ రైడర్స్ కు కెప్టెన్గా సేవలు అందించలేకపోయాడు. బోర్డర్గ గవాస్కర్ ట్రోఫీకి ముందు వెన్నుగాయంతో ఇబ్బంది పడ్డాడు. తొలి టెస్ట్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత ఆఖరి టెస్టులోనే ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి బ్యాటింగ్ కు దిగలేకపోయాడు. ఇక ఆసియాకప్ లో సూపర్ ఫోర్ మ్యాచ్లో అయ్యర్ బదులుగా కేఎల్ రాహుల్ జట్టులోకి ప్రవేశించాడు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading