జూనియర్ ఎన్టీఆర్ మౌనంపై స్పందించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చంద్రబాబు రిమాండ్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో… టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. https://apskilldevelopmenttruth.com/ వెబ్ సైట్ ను ప్రారంభించారు టీడీపీ సీనియర్ నేతలు. ఈ కార్యక్రమానికి అచ్చెన్నాయుడు, యనమల,నిమ్మల రామానాయుడు,ఇతర నేతలు హజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… జూనియర్ ఎన్ఠీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్ని అడగాలి..మమల్ని అడిగితే ఏం తెలుస్తుందని సీరియస్ అయ్యారు.
ఎవరినీ స్పందించమని మేం అడగబోమని… జూనియర్ ఎన్ఠీఆర్ పై సీరియస్ అయినట్లు మాట్లాడారు అచ్చెన్నాయుడు. సంబంధం లేని కేసులో చంద్రబాబును ఇరికించారని.. హైదరాబాద్ లో విజయవాడలో స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో వచ్చినట్లు రోడ్డుపైకి వస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టారని.. స్కిల్ డెవలప్మెంటులో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెప్పారు.
Advertisement
Advertisement
ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలనే ఉద్దేశ్యంతో వెబ్ సైట్ ఓపెన్ చేశామని.. నవంబర్ 2014 నుంచి జరిగిన అన్ని అంశాలు వెబ్ సైటులో పొందుపరిచామని తెలియజేశారు. ఏపీ కంటే ముందు చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అమలైందని… కార్యక్రమం బాగా అమలైందంటూ కేంద్రం అవార్డులు కూడా ఇచ్చిందని.. 2,17,500 మంది యువత ఐదు క్లస్టర్ల ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారని గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంటు ద్వారా 65 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
ఇవి కూడా చదవండి
- MS Dhoni : సాధారణ ఫ్యాన్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్
- పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు..భార్య ఉండగా వేరే అమ్మాయితో ! !
- Virat Kohli : వాటర్ బాయ్’గా మారిన విరాట్ కోహ్లి..వీడియో వైరల్ !