Ms Dhoni : ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు మూడు ఐసీసీ టోర్నమెంట్లను అందించిన ఏకైక క్రికెటర్ గా ధోనీకి ఒక చరిత్ర ఉంది. 2007 సంవత్సరంలో దక్షిణాఫ్రికా దేశంలో జరిగిన టి20 వరల్డ్ కప్ ను మొదటగా తీసుకువచ్చి చరిత్ర సృష్టించాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాత 2011 సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ ను తన కెప్టెన్సీలో టీమిండియా కు అందించారు మహేంద్ర సింగ్ ధోని.
ఇక చివరగా 2013 సంవత్సరంలో ఏ కెప్టెన్ వల్ల కానీ ఛాంపియన్స్ ట్రోఫీని… కూడా టీమిండియా కు అందించాడు ధోని. అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఇది ఇలా ఉండగా తాజాగా మహేంద్రసింగ్ ధోని… ఓ వ్యక్తికి బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… తాజాగా రాంచీలో ట్రైనింగ్ స్టేషన్ పూర్తి చేసుకున్న ధోని…
Advertisement
Advertisement
ఓ ఫ్యాన్ కోరిక మేరకు అతన్ని బైక్ పై ఎక్కించు కొని… డ్రాప్ చేశాడు. యమహా ఆర్ డి 350 అనే వెహికల్ ను ధోని డ్రైవ్ చేస్తుండగా… అతని ఫ్యాన్ వెనకాల కూర్చుని వీడియో తీశాడు. తనకు ధోని భాయ్ లిఫ్ట్ ఇచ్చాడని… తెగ సంబరపడిపోయాడు ఆ ఫ్యాన్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా…. ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోని…చెన్నయ్ జట్టును 5 సార్లు ఛాంపియన్ గా నిలిపిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు..భార్య ఉండగా వేరే అమ్మాయితో ! !
- Virat Kohli : వాటర్ బాయ్’గా మారిన విరాట్ కోహ్లి..వీడియో వైరల్ !
- Money : మీ చేతిలో డబ్బు నిలవాలంటే..ఇంట్లో వీటిని పెట్టుకోండి..ముఖ్యంగా ఆ ఫోటో…!