పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యల పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తులో ఉంటూ టీడీపీతో పొత్తు ప్రకటించటాన్ని రేణూ దేశాయ్ వ్యాఖ్యలతో పోల్చిన రోజా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భార్య ఉండగా వేరే అమ్మాయితో పిల్లలను కంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని గతంలో రేణు దేశాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఉటంకిస్తూ…. పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు పేల్చారు. పవన్ కళ్యాణ్ జెండా చంద్రబాబు ప్యాకేజీ అని… అజెండా చంద్రబాబు, లోకేష్ కు బానిసగా బతకటం అని చురకలు అంటించారు రోజా.
Advertisement
భార్య ఉండగా వేరే అమ్మాయితో పిల్లలను కంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని రేణు దేశాయ్ గతంలో జన సైనికులకు చెప్పారని…ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటనతో రేణు దేశాయ్ వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవటం సన్యాసి, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది లాంటిదేనని… చంద్రబాబు సంగతి బీజేపీకి తెలుసు అని పేర్కొన్నారు. బీజేపీతో చర్చించకుండా టీడీపీతో అని పవన్ కళ్యాణ్ ప్రకటించటం పొత్తు ధర్మానికి తూట్లు పొడవటమేనని…2018లోనే స్కిల్ కుంభకోణం బయటపడిందని తెలిపారు.
Advertisement
చంద్రబాబు తప్పు చేయలేదని నమ్మితే సీబీఐ, ఈడీ విచారణ చేయమని లేఖ రాయాలని… ఢిల్లీ వెళుతున్న లోకేష్ అక్కడే ఉన్న ఈడీ, సీబీఐ ఆఫీసుకు వెళ్ళి ఈ కుంభకోణాల పై విచారణ చేయాలని లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. ఎకరం భూమి నుంచి వేల కోట్లు చంద్రబాబు వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయని.. వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉండటం వల్లే ఇన్నేళ్ళు తప్పించుకుని తిరిగాడన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబు స్కాం లను ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు. అరెస్టు దెబ్బతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ భాష మారిందన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.
ఇవి కూడా చదవండి
- Virat Kohli : వాటర్ బాయ్’గా మారిన విరాట్ కోహ్లి..వీడియో వైరల్ !
- Money : మీ చేతిలో డబ్బు నిలవాలంటే..ఇంట్లో వీటిని పెట్టుకోండి..ముఖ్యంగా ఆ ఫోటో…!
- Naga Chaitanya : మోటార్ స్పోర్ట్ రేసింగ్ లో నాగచైతన్య ఎంట్రీ !