నాగార్జున కెరీర్ బెస్ట్ సినిమాలలో హలో బ్రదర్ కూడా ఒకటి. ఈ సినిమాలో నాగార్జున డబుల్ యాక్షన్ తో ఆకట్టుకున్నారు. 1994 ఏప్రిల్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని 2.5 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 1993లో నాగార్జున హీరోగా వచ్చిన వారసుడు సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
Advertisement
దాంతో నాగార్జున ఈవివితో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఈవివి సత్యనారాయణ ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ లో తనకు బాగా నచ్చిన ట్విన్ డ్రాగన్ కథను నాగార్జునకు వినిపించారు. ఈ సినిమా చేద్దామని చెప్పగా నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Advertisement
అలా హలో బ్రదర్ సినిమాను అనుకున్నారు. ఇక ఈ చిత్రానికి ఎల్బీ శ్రీరామ్ డైలాగులు రాశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, సౌందర్యలను హీరోయిన్లు గా తీసుకున్నారు. షూటింగ్ కూడా చక్కగా పూర్తి చేశారు. ట్విన్స్ అనే కాన్సెప్ట్ తో అప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ…. ఇద్దరు కవలలు ఒకే రకంగా ప్రవర్తించడం అనే కొత్త కాన్సెప్ట్ తో ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను తీశారు.
ఇక ఈ చిత్రం రికార్డుల మోత మోగించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఈ సినిమా 120 షోలు హౌస్ ఫుల్ గా ఆడి రికార్డులు బద్దలు కొట్టింది. 30 రోజుల పాటు రోజుకు నాలుగు ఆటలు హౌస్ ఫుల్ గా రన్ అయ్యింది. అదేవిధంగా 30 కేంద్రాల్లో 50 రోజులు… 20 కేంద్రాలలో 100 రోజులు ఆడి రికార్డులు తిరగరాసింది.