స్టార్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విలన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన గోపీచంద్ కొన్ని సినిమాలలో విలన్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. ఎన్నో సినిమాలలో హీరోగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక కొన్ని రోజుల నుంచి ఇతనికి ఇండస్ట్రీలో పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. రీసెంట్ గా రామబాణం సినిమాతో మళ్లీ డీల పడిపోయాడు గోపీచంద్. ఇక మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు గోపీచంద్.
# గోపీచంద్ 32 అనే వర్కింగ్ టైటిల్ తో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమాకి పూజ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ ఈవెంట్ లో గోపీచంద్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోపీచంద్ మాత్రమే కాకుండా మరో డైరెక్టర్ కెఎస్.రవికుమార్ చేసిన వాక్యాలు వైరల్ గా మారాయి. ఈ డైరెక్టర్ రీసెంట్ గా మన్నార చోప్రాతో చనువుగా ప్రవర్తించి చాలా దారుణమైన ట్రోల్స్ కు గురయ్యాడు. ఇక అంతేకాకుండా గోపీచంద్ పై కూడా అనేక విమర్శలు చేసి ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. గోపీచంద్ విలన్ గా చేస్తున్న సమయంలో యజ్ఞం సినిమాతో తనని హీరోగా పరిచయం చేశానని చెప్పుకొచ్చాడు.
Advertisement
Advertisement
అంతేకాకుండా ఆ క్రమంలో గోపీచంద్ నీ పట్టుకుని వాడు వీడు అంటూ తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అలాంటి వ్యక్తి నేను స్టోరీ చెప్పడానికి ఇంటికి వెళ్తే ఒక గంట పాటు నన్ను వెయిట్ చేయించాడు అని గోపీచంద్ పేరు చెప్పకుండా ఈ విషయాన్ని చెబుతూ ఆగ్రహించుకున్నాడు. అయితే వారం రోజుల కిందట ఈ డైరెక్టర్ ఈ కామెంట్ చేయడంతో ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గోపీచంద్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు… కేఎస్ రవికుమార్ మాట్లాడిన మాటలు, అతను చేసిన చేష్టలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోసారి డైరెక్టర్ రవికుమార్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
- Lavanya Tripathi : పెళ్ళికి ముందు లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం !
- బేబీ మూవీలో పెళ్లికొడుకు.. యాంకర్ విష్ణుప్రియకు ఉన్న సంబంధం ఇదే ?
-
అలాంటి పాత్రలకే పరిమితమైన హనీ రోజ్…!