లీలా నాయుడు…. 1960 నుండి 1980 వరకు బాలీవుడ్ మొత్తం ఈమె అందానికి ఫిదా అయిపోయింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కూతురు ఈ లీలా నాయుడు. రామయ్య పారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేస్తున్న సమయంలో అక్కడ పరిచయమైన ఫ్రెంచ్ కు చెందిన మార్తాను పెళ్లిచేసుకున్నారు. రామయ్య- మార్తాల సంతానమే ఈ లీలా నాయుడు. మార్తా ఇండియాలోని ఆచార వ్యవహారాల మీద అనేక పరిశోధనలు చేశారు.
Advertisement
Advertisement
లీలానాయుడు 15 ఏళ్ల వయసులో ఫెమినా మిస్ ఇండియాగా ఎన్నికైంది. అంతేకాదు వోగ్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచ 10 మంది అందగత్తెల్లో లీలా ఒకరు! ఇది ఇలా ఉండగా ఈమె అందాన్ని మెచ్చిన ఓబెరాయ్ హోటల్స్ ఓనర్ ఒబెరాయ్ కుమారుడు తిలక్ రాజ్ 1956లో అంటే లీలాకు 16 ఏళ్ళ వయసులో పెళ్లిచేసుకున్నాడు. వీరికి కవలలు పుట్టాక వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత సినీ ఇండస్ట్రీపై దృష్టి సారించిన లీలా అనూరాధ, ఉమ్మీద్, త్రికాల్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అటు తర్వాత గోవా చెందిన ప్రముఖ రైటర్ డామ్ మోరెస్ ను 1969లో పెళ్ళి చేసుకుంది. 2011లో భారత ప్రభుత్వం ఈమె మీద పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది.