Home » పుష్ప 2 లో.. ఆమె పాత్రపై క్లారిటీ ఇచ్చేసిన ప్రియమణి…!

పుష్ప 2 లో.. ఆమె పాత్రపై క్లారిటీ ఇచ్చేసిన ప్రియమణి…!

by Sravya

అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు. పుష్ప టు సినిమాతో బిజీ అయిపోయారు బన్నీ. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప వన్ అల్లు అర్జున్ కి మంచి గుర్తింపు ని తీసుకువచ్చింది. సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే రాబోతోంది. ఈ విషయం అందరికీ తెలుసు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది పుష్ప టు సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రస్తుతం జోరుగా కొనసాగుతోంది అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నారని ఆయన భార్య కింద ప్రియమణి నటిస్తున్నారని ఒక వార్త నెట్టింట వైరల్ అయింది. దీనిమీద ప్రియమణి క్లారిటీ ఇచ్చేసారు. పుష్ప టు సినిమాలో నేను నటించట్లేదు అవి కేవలం నకిలీ వార్తలు అని ప్రియమణి క్లారిటీని ఇచ్చేశారు. ఈ వార్తను చూసి ఆశ్చర్యపోయానని వెంటనే తన మేనేజర్ కి ఫోన్ చేసి అడిగానని కూడా ఆమె చెప్పింది. అల్లు అర్జున్తో కలిసి నటించే ఛాన్స్ వస్తే కచ్చితంగా వదులుకోనని ప్రియమని అన్నారు. మొన్న రిలీజ్ అయిన జవాన్ సినిమాలో ప్రియమణి ఒక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Also read:

Visitors Are Also Reading