ద్వారా పాపులర్ అయినటువంటి వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోడలింగ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో, సీరియల్స్ లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ ద్వారా ఈ అమ్మడు చాలా ఫేమస్ అయ్యింది. జబర్దస్త్ లో ఈ అమ్మడు అందానికి, కామెడీ టైమింగ్ కి చాలా ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఇమ్మానుయేల్, వర్ష జంటగా నటించి వారు చేసే కామెడీ చాలా పాపులర్ అవుతుంది.
ఈ అమ్మడికి సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. అందం, అభినయం కాకుండానే వర్షాకి మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంది. వారి ఇంట్లో పనిచేసే వాచ్మెన్ కొడుకుకి వర్ష తనకు చేతనయినంత సహాయం చేస్తుంది. వాచ్మెన్ కొడుకుకి చదువుకోడానికి డబ్బులు లేకపోవడంతో వర్ష తన చదువుకి కావాల్సిన ఖర్చులు భరిస్తోంది. తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా వర్షని యాంకర్ మీరు ఒక వ్యక్తిని చదివిస్తున్నారు అది నిజమేనా అని ప్రశ్నించగా… దానికి సమాధానంగా వర్ష అవును అది నిజమే మా వాచ్మెన్ కి ఇద్దరు కొడుకులు. వారికి ఇద్దరిని చదివించే అంత స్తోమత లేదు.
Advertisement
Advertisement
అందుకే వారి అబ్బాయి చదువుకు కావలసిన ఖర్చుని నేను భరిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. నా వంతుగా నేను సంపాదిస్తున్న దాంట్లో ఏదో చిన్న సహాయాన్ని చేస్తున్నాను. నేను అలా చదివించడం పట్ల వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారిది చాలా పేద కుటుంబం. నాకు చేతనయినంత నేను సహాయం చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. సినిమాలలో అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని వర్ష చెప్పుకొచ్చింది. వర్ష జబర్దస్త్ లో నటించి భారీగానే సంపాదిస్తుంది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ని కూడా నిర్వహిస్తూ డబ్బులను సంపాదిస్తోంది.
ఇవి కూడా చదవండి
పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్!
Actor Manas: శ్రీజతో ‘బ్రహ్మముడి’ సీరియల్ హీరో నిశ్చితార్థం
ఖుషి సూపర్ హిట్.. అజ్ఞాతంలోకి నాగచైతన్య..?