సీరియల్ నటుడు మానస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత తన చదువుపై దృష్టి పెట్టి చదువు పూర్తయ్యాక మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. పలు సినిమాలలో నటించడమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. బిగ్ బాస్ సీజన్ 5లోకి వచ్చి ప్రేక్షకులను అలరించి ఎంతో క్రేజ్ ని తెచ్చుకున్నాడు.
ఇక ఈ మధ్యకాలంలో బ్రహ్మముడి సీరియల్ లో నటించి విపరీతమైన క్రేజ్ నీ సొంతం చేసుకున్నాడు. ఇక మానస్ బిగ్ బాస్ లో ఉన్న సమయంలో కొందరితో ప్రేమాయణం నడిపాడు అనే వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలను పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పాడు. నిన్న ఎంగేజ్మెంట్ చేసుకొని ప్రేక్షకులు అందరికీ షాక్ ఇచ్చాడు. నిన్న చెన్నైలో శ్రీజ అనే అమ్మాయితో మానస్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరుపుకున్నాడు. ఇక ఈ ఎంగేజ్మెంట్ కు తన స్నేహితులు హాజరయ్యారు.
Advertisement
Advertisement
మానస్ ఇప్పటివరకు ఎప్పుడు తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ఎలాంటి వార్తలు చేయకపోవడంతో తన ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసి చాలామంది అభిమానులు షాక్ అయ్యారు. ఇక తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా అందంగా ఉందంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. శ్రీజ ప్రొఫెషన్ ఏంటి… తాను ఏం చేస్తుంది…అనే వివరాలేవీ తెలియ రాలేదు. ఇక త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.
ఇవి కూడా చదవండి
ఖుషి సూపర్ హిట్.. అజ్ఞాతంలోకి నాగచైతన్య..?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులం అందరం కాంగ్రెస్ ను క్షమించాలి – వైఎస్ షర్మిల
చిరంజీవి, బాలయ్య ఇద్దరి మధ్య తేడా చూడండి…!