Home » సాయంత్రం అయితే రోడ్డుపై పానీపూరి తింటున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోండి!

సాయంత్రం అయితే రోడ్డుపై పానీపూరి తింటున్నారా? అయితే ఈ విషయాలను తెలుసుకోండి!

by Srilakshmi Bharathi
Ad

మనలో చాలా మందికి సాయంత్రం పూట చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. కొంతమంది అయితే.. సాయంకాలాలు బయటకి వెళ్లి ఏ పునుగులో తినేసి వస్తూ ఉంటారు. ఇది ప్రతిరోజు అలవాటుగా మార్చుకోవడం అస్సలు మంచిది కాదు. కొంతమంది అయితే, పానీపూరి, చాట్ లాంటివి తింటారు. వారికి ఇవి తినకపోతే రోజు గడవదు అన్నట్లుగా తయారైపోతూ ఉంటారు. కానీ ఇవి అస్సలు మంచిది కాదు. పానీపూరి తినే వారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి.

Advertisement

చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరు ఇష్టంగా తినే పదార్ధం పానీపూరి. అయితే ఇది అంత ఆరోగ్యకరం మాత్రం కాదు. ఈ పానీ పూరిలో ఎన్నో రకాల బ్యాక్టిరియాలు ఉన్నాయని వైద్యులు తేల్చి చెప్పారు. చూడడానికి అవి శుభ్రంగా ఉన్నట్లు కనిపించినా.. వారు అమ్మే పానీ లో 45 శాతం, చట్నీలో 75 శాతం వరకు హానికరమైన ఈ కోలి బాక్టీరియా ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

ఈ బ్యాక్టిరియా, ఫంగస్ చాలా త్వరగా మన శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. చాలా మంది పానీ పూరి అమ్మేవారు పానీపూరి, చాట్స్ ను ప్లాస్టిక్ ప్లేట్ లలో పెట్టి ఇస్తారు. ఇటువంటి ప్లాస్టిక్ ప్లేట్ లలో తినడం కూడా ఆరోగ్యానికి హానికరమట. తినుబండారాల విషయంలో శుభ్రత చాలా ముఖ్యమైనది. కానీ, స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో ఆ శుభ్రత లోపిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. అయితే.. పానీ పూరి అంటే అమితమైన ఇష్టం ఉన్న వారు ఇంట్లోనే వండుకుని తినవచ్చు.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !

Visitors Are Also Reading