Home » BCCIకి డబ్బులే డబ్బులు… ఒక్కో మ్యాచ్ కి రూ. 67 కోట్లు…!

BCCIకి డబ్బులే డబ్బులు… ఒక్కో మ్యాచ్ కి రూ. 67 కోట్లు…!

by Bunty
Ad

 

ప్రపంచంలో బీసీసీఐ రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతుంది. జెంటిల్ మెన్ గా గేమ్ లో ఓ మతంల భావించే ఇండియన్స్ క్రికెట్ ను ఎగబడి చూస్తారు. అదే బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తోంది. ఒకప్పుడు డబ్బులు లేక సగమతమైన స్థితి నుంచి ఇప్పుడు వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డుకు బీసీసిఐ చేరుకుంది. అందుకే క్రికెట్ మ్యాచుల్లో ప్రచారం చేసేందుకు మీడియా ఛానళ్లు పోటీ పడుతుంటాయి. ఇందుకోసం బీసీసీఐకి కోట్ల రూపాయలు కురిపించడానికి ఆయా ఛానళ్లు రెడీ అవుతున్నాయి. దీంతో బీసీసీఐ ప్రసార ఛానల్ నుంచి భారీగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకి ఎంతైనా చెల్లిస్తామని ముందుకొచ్చింది.

Viacom 18 bags BCCI rights for both digital and TV

Viacom 18 bags BCCI rights for both digital and TV

వయాకాం 18 ఈ వేలంలో వయాకాం 18ను సోనీ పిక్చర్స్ డిస్నీస్టార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికి వయాకాం 18 ఆ రెండు చానళ్లకు బిగ్ షాక్ ఇచ్చింది. టీమిండియా స్వదేశంలో ఆడే క్రికెట్ మ్యాచుల మీడియా హక్కులను రిలయన్స్ కు చెందిన వయాకాం 18 సంస్థ చేజిక్కించుకుంది. ఇందుకోసం బీసీసీఐకి 6 వేల కోట్లు చెల్లించనుంది. డిజిటల్ కు 3,101 కోట్లను టీవీ ప్రసార హక్కులకు 2,862 కోట్లను చెల్లించింది రెండు విభాగాలు కలిపి మొత్తం 5,963కోట్లను బీసీసీఐకి ఆదాయం సమకూరింది.

Advertisement

Advertisement

ఈ ఒప్పందం ప్రకారం భారత జట్టు సొంత గడ్డపై ఆడే మ్యాచ్లను వయాకాం తన స్పోర్ట్స్ 18 ఛానల్లో ఐదేళ్లపాటు ప్రసారం చేస్తోంది. ఈ ఏడాది నుంచి 2028 వరకు అన్ని సీజన్ల మ్యాచ్లను వయాకాం ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందులో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20లు ఉన్నాయి. అంటే ఒక్క మ్యాచ్ బోర్డుకు 67.76 కోట్లు దక్కనున్నాయి. సెప్టెంబర్ 22న సొంత గడ్డపై టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ తో వయాకాం ఒప్పందం అమలులోకి వస్తుంది. ఈ ఒప్పందం 2028 మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 18 లేదా 19…? వినాయకచవితి ఏ రోజు చేసుకోవాలి…?

Samantha : సమంతను దారుణంగా మోసం చేశారు..పాపం కోట్ల నష్టం ?

Anushka : పాన్​ ఇండియా లెవెల్​లో అనుష్క మూవీ.. 14 భాషల్లో రిలీజ్​.. హీరో ఎవరంటే?

Visitors Are Also Reading