జుట్టు రాలిపోవడం వలన ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, జీవనశైలి ఇలా అనేక కారణాల వలన జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలిపోవడం, చుండ్రు, చిట్లిపోవడం ఇలా జుట్టుకి సంబంధించిన అనేక సమస్యలతో చాలా మంది బాధ పడుతున్నారు అయితే ఇలాంటి బాధలు ఏమీ లేకుండా ఉండాలంటే ఈ చిట్కాని ట్రై చేయండి. ఇలా చేస్తే సులభంగా ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు.
అరకప్పు కొబ్బరి తీసుకోవాలి. మిక్సీ జార్ లో వాటర్ వేసుకుని, కొబ్బరిపాలని తీసుకోండి. ఇందులో పావు టీ స్పూన్ దాల్చిన పొడి వేసుకోండి. టీ ట్రీ ఆయిల్ కూడా వేసి అరగంట పాటు వదిలేయండి. రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి బాగా పట్టించి గంటసేపు వదిలేసి తర్వాత కుంకుడుకాయలతో తల స్నానం చేసేయండి. వారానికి రెండే సార్లు ఇలా చేస్తే సరిపోతుంది. జుట్టు కి బలం బాగా వస్తుంది. జుట్టు రాలిపోకుండా ఉంటుంది. కురులు ఒత్తుగా అందంగా మారుతాయి.
Advertisement
Advertisement
Also read:
- వానాకాలంలో బట్టల నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!
- ఆరోగ్యానికి పసుపు మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా..? ఈ నష్టాలు తప్పవు..!
- శ్రావణ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఇవి కలిపితే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.. !