Home » అన్వేష్ ప్రేమ- పెళ్లి- విడాకులపై కీలక వ్యాఖ్యలు!

అన్వేష్ ప్రేమ- పెళ్లి- విడాకులపై కీలక వ్యాఖ్యలు!

by Bunty
Ad

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. యూట్యూబ్ ద్వారా చాలామంది ఉపాధి పొందుతున్నారు. అచ్చం అలాగే ఏపీకి చెందిన అన్వేష్… ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచి… యూట్యూబ్ ద్వారా చాలా లాభాలు పొందుతున్నాడు. ఇటీవల చైనా సీరియస్ చేసిన అన్వేష్.. ఏకంగా 30 లక్షలు రాబట్ట గలిగాడు. అలా రెండు నెలలు 30 లక్షలు ప్లస్ 30 లక్షలు ఓవరాల్గా 60 లక్షలు సంపాదించాడు యూట్యూబర్ అన్వేష్.

Advertisement

అయితే తాజాగా యూట్యూబర్ అన్వేష్ తన పెళ్లి గురించి అలాగే విడాకుల గురించి ఓ సంచలనం వీడియో పెట్టాడు. అన్వేష్ పెళ్లి ఎప్పుడు అని యువర్స్ అడగడంతో ఈ వీడియోను పెట్టాడు. అప్పట్లో అన్వేష్ అమెరికాలో ఓ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. కానీ కరోనా వచ్చిన నేపథ్యంలో అమెరికా నుంచి అతన్ని ఇంటికి పంపించేశారు. దీంతో అతని ఉద్యోగం కూడా పోయింది.’

Advertisement

అయితే అమెరికాలో ఉద్యోగం పోవడంతో అన్వేష్ కు పిల్లను ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. ఇదివరకు ఫిక్స్ అయిన సంబంధం కూడా… నిశ్చితార్థం కాకుండానే బ్రేకప్ అయిపోయింది. ఈ విషయాన్ని అన్వేష్ తన వీడియో ద్వారా తెలిపాడు. ఉద్యోగం ఉంటే ఇస్తామని… లేకపోతే పిల్లను ఇవ్వమని అందరూ చెప్పేసారట. అయితే ఉద్యోగం పోయినప్పటికీ తాను… యూట్యూబర్ గా మాత్రం సక్సెస్ అయినట్లు వెల్లడించాడు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చే సమయంలో 40 రోజులపాటు పడవలో ప్రయాణించడం కారణంగా… తాను చాలా వీడియోలను యూట్యూబ్లో పెట్టినట్లు ఎన్నోసార్లు చెప్పినా అన్వేష్… ఆ తర్వాత సక్సెస్ అయినట్లు వెల్లడించాడు. కాగా ప్రస్తుతం అన్వేష్ యూట్యూబ్ ఛానల్ కు 1.47 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు.

Visitors Are Also Reading