Home » ఎన్టీఆర్‌ రూ.100 నాణెం.. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా..?

ఎన్టీఆర్‌ రూ.100 నాణెం.. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసా..?

by Sravya
Ad

అప్పుడప్పుడు మనకి పాత నాణాలు వంటివి కనిపిస్తూ ఉంటాయి. అలానే స్పెషల్ గా కొన్ని కాయిన్స్ ని కూడా అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పేరిట రూ.100 నాణాన్ని రిలీజ్ చేయనున్నారు. సోమవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపతి మురుము చేతులు మీదుగా దీనిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటుగా నందమూరి ఫ్యామిలీ వాళ్ళు కూడా హాజరయ్యారు.

Advertisement

కాయిన్ ని రిలీజ్ చేసిన తర్వాత ఎన్టీఆర్ జీవితం గురించి 20 నిమిషాల వీడియోని ప్లే చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ కాయిన్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయట ఈ నాణెం తయారీలో నాలుగు లోహాలను వినియోగించడం జరిగింది. దీని చుట్టుకొలత 44 మిల్లీమీటర్లు. ఈ కాయిన్ తయారీలో 50 శాతం వెండి, 40% రాగి, 5% నిఖిల్, 5% జింక్ ని వినియోగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నాణానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

విడుదలైన తర్వాత ఈ నాణానికి సంబంధించి వివరాలన్నీ కూడా వస్తాయి. ఒకవైపు మూడు సింహాలు అశోక చక్రం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఎన్టీఆర్ ఫోటో వందేళ్ళను సూచిస్తూ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అతిధుల జాబితాలో లక్ష్మీపార్వతి పేరు మాత్రం లేదు ఆమెని ఆహ్వానించలేదట. కేంద్రం అందరికీ ఆహ్వానాన్ని పంపించినా లక్ష్మీపార్వతికి పంపించలేదు దీనితో ఆమె రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆహ్వానితుల లిస్టులో తన పేరు లేదని ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Also read:

Visitors Are Also Reading