Home » ఆ నటుడు వల్లే చిరు పెళ్లి ఆగే వరకు వెళ్ళింది.. కానీ ఆఖరికి..?

ఆ నటుడు వల్లే చిరు పెళ్లి ఆగే వరకు వెళ్ళింది.. కానీ ఆఖరికి..?

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి ఎంతోమందికి ఇప్పుడు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చిరిగిన చొక్కా తో పెళ్లి చేసుకున్నారన్న విషయం మనకు తెలుసు. అయితే పెళ్లి సమయంలో ఎంతో హడావిడి అయిందట. పెళ్లి కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చిందట దీనంతటికీ కారణం ఒక నటుడు అని తెలుస్తోంది. చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీ లోకి వచ్చి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు.

Advertisement

ఇప్పుడైతే చిరంజీవికి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఏ పాత్ర వచ్చినా కూడా దానిని వినియోగించుకుంటూ ఇంత పేరు తెచ్చుకున్నారు. చిరంజీవిలో పట్టుదల చూసి అల్లు రామలింగయ్య ఎలా అయినా సరే తన అల్లుడి కింద చేసుకోవాలని అనుకున్నారు. అల్లు అరవింద్ చిరంజీవి గుణగణాలని చూసి చెడు అలవాట్లేమీ లేవని సురేఖకి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు. చిరంజీవి కూడా సురేఖని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అయితే మీరు పెళ్లి సమయంలో ఒక సంఘటన చోటుచేసుకుంది.

Advertisement

చిరంజీవి తాళి కట్టే సమయం దాకా కూడా షూటింగ్ లోనే ఉన్నారట దానికి ముఖ్యమైన కారణం నూతన ప్రసాద్. నూతన ప్రసాద్ డేట్లు దొరికేవి కావు. ఒకసారి మిస్ అయితే మళ్ళీ రెండు మూడు నెలల వరకు కూడా షూట్ చేయడం కుదరదు కాదట. చిరంజీవి పెళ్లి రోజున చిరంజీవికి నూతన ప్రసాద్ కి మధ్య కొన్ని ముఖ్యమైన సీన్లని షూట్ చేశారట ఈ కారణంతో చిరంజీవి పెళ్లి ని వాయిదా వేసుకునే దాకా వెళ్లారట.

కానీ ఆ సమయంలో సినిమా నిర్మాత పెళ్లి గురించి ఆలోచించి పెళ్లికి దగ్గరలోనే షూటింగ్ని పెట్టారట. షూటింగ్ పూర్తి అయిన తర్వాత చిరిగిన చొక్కా వేసుకుని చిరంజీవి సురేఖ మెడలో తాళి కట్టారు. నూతన ప్రసాద్ కారణంగా చిరంజీవి పెళ్లి ఆగిపోయేది కానీ షూటింగ్ ప్లేస్ మార్చడం వలన చిరంజీవి పెళ్లి ముహూర్తం టైం కి వెళ్లారు నిర్మాత సరిగ్గా అర్థం చేసుకోకపోతే చిరంజీవి పెళ్లి ఆగిపోవాల్సిందేనట.

Also read:

Visitors Are Also Reading