హిందూ ధర్మంలో పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆరోజున, స్నాన, దానాలు, తర్పణాలు, సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టడాలు చేయాలని చెప్పబడింది. ఈ ఏడాది పౌర్ణమి వచ్చే రోజులలో భద్ర నీడ ఉంది. అందుకే ఈ ఏడాది రక్షా బంధన్ ను ఆగస్టు 30, ఆగస్టు 31 తేదీల్లో జరుపుకోవాలి.
Advertisement
ఈరోజున శని మరియు బృహస్పతి గ్రహాలు తిరోగమనంలో ఉన్న కారణంగా బుధాదిత్య యోగం కలగబోతోంది. దీని వలన ఈ ఏడాది వచ్చే శ్రావణ పౌర్ణమి రోజున కొన్ని వస్తువులను ఇంట్లోకి తీసుకువెళ్లడం వలన ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. ఇవి మీ వైవాహిక జీవితానికి కొత్త దశను నిర్దేశిస్తాయి. దాదాపు 200 ఏళ్ల తరువాత రాబోయే ఈ ప్రత్యేక పూర్ణిమ రోజున అద్భుతం జరగబోతోంది. ఈ ప్రత్యేకమైన రోజున ఈ వస్తువులను కచ్చితంగా మీ ఇంటికి తీసుకువెళ్ళండి.
Advertisement
వెండితో చేయబడిన స్వస్తికను ఇంట్లోకి తీసుకెళ్లండి. ఇంటికి స్వస్తిక్ గుర్తు వేయడం వలన ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటె తొలగిపోతాయని చెబుతుంటారు. అందుకే వెండి స్వస్తికను తీసుకొచ్చి ఇంటి తలుపులకు తగిలించండి. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. ఏకాక్షి కొబ్బరికాయ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కొబ్బరికాయ ఉన్న ఇంట్లో పేదరికం ఉండదు. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మొదుగ చెట్టు పువ్వులు లక్ష్మి దేవికి చాలా ఇష్టమైనవి. ఈ మొక్కని కూడా ఇంటికి తెచ్చుకుని పెంచుకోండి. శ్రావణ పౌర్ణమి రోజు బంగారం మరియు వెండి ని కొనుగోలు చేయడం చాలా శుభకరమైనది. ఈరోజున వీటిని కొనుగోలు చేస్తే ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది.
మరిన్ని..
స్కంద ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. దర్శకులు ఆ విషయంపై దృష్టి సారించాలి..!
ఆలీ చేసిన సూపర్ హిట్ మూవీని వదలుకున్న మహేష్ బాబు ?