Home » ఆసియా కప్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ…ఆ భారత ప్లేయర్ ఎవరంటే…?

ఆసియా కప్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ…ఆ భారత ప్లేయర్ ఎవరంటే…?

by Bunty
Ad

 

ప్రతిష్టాత్మక ఆసియాకప్ ఈ నెల 30 నుంచి ప్రారంభం కాబోతోంది. బీసీసీఐ కూడా ఈ టోర్నీ కోసం శ్రీలంకకు వెళ్లి టీమిండియా జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టును సెలెక్ట్ చేయగా అందులో స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు ప్లేస్ దక్కలేదు. అతను పక్కాగా టీం లో ఉంటాడని ఫ్యాన్స్ భావించారు. కానీ బీసీసీఐ మాత్రం అతనికన్న అక్షర్ పటేల్ కు మొగ్గు చూపింది. దాంతో చాహల్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత కామెంట్స్ వచ్చాయి.

Advertisement

ఫామ్ లో ఉన్న స్పిన్నర్ ను కీలక టోర్నీకి సెలెక్ట్ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. అక్షర్ కి బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా సామర్థ్యం ఉండడం వల్లే చాహల్ బదులు అక్షర్ కు ఛాన్స్ ఇచ్చామని అభిప్రాయపడ్డారు. అక్షర్ ను సెలెక్ట్ చేయడం మంచి నిర్ణయమేనని తెలిపారు. ఇక దాంతోపాటు ఆసియా కప్ లో చాహల్ రీఎంట్రీ ఇవ్వడంపై గంగూలీ మార్గం చెప్పాడు. ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలక్షన్ టీం 16 మంది ప్లేయర్స్ తో పాటు రిజర్వ్ ప్లేయర్ గా సంజు శాంసన్ ను తీసుకుంది.

Advertisement

 

ఈ 17 మంది ఎవరైనా గాయపడితే సెలెక్టర్లు ఫస్ట్ ఛాయిస్ చాహల్ అనే గంగూలీ తెలిపారు. ఆసియా కప్ లో టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ ను సెప్టెంబర్ 2న పాకిస్తాన్ తో ఆడుతుంది. శ్రీలంకలోని పల్లెకేలే అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. త్వరలో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఆసియా కప్ చాలా కీలకము. మరి ఈ టైం లో చాహాల్ కు ఛాన్స్ రావడం కష్టం. వెస్టిండీస్ పర్యటనలో అక్షర్ కు ఎక్కువ చాన్సులే ఇచ్చారు. కానీ అతను అంతగా రాణించలేదు. మరి ఆసియా కప్ లో సత్తా చాటుతాడా? లేదా? అనేది చూడాలి.

Visitors Are Also Reading