మనమే అంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి శరీరం పట్ల పట్టింపు లేకపోవడం, లేదా ఎక్కువగా వానల్లో తడవడం, లేదా మరే ఇతర కారణాల వలన జ్వరం వస్తూ ఉంటుంది. బాడీ టెంపరేచర్ పెరిగి, నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో విశ్రాంతి తీసుకుని, తగిన పోషకాహారం తీసుకుంటే శరీరం త్వరగా కోలుకుంటుంది. పిల్లలకు, పెద్దలకు అని తేడా లేకుండా జ్వరం అందరికీ వస్తుంది. అయితే.. జ్వరం వచ్చినప్పుడు ఎవరూ స్నానం చెయ్యరు.
Advertisement
ఓపిక లేకపోవడం, నీరసం కారణంగా ఎవ్వరికీ స్నానం చేయాలనీ కూడా అనిపించదు. స్నానం చేయాలనీ లేకపోయినా.. గోరు వెచ్చని నీటితో జ్వరం వచ్చిన సమయంలో స్నానం చేయడం వలన చాలా ఉపశమనం కలుగుతుంది. ఇలా స్నానం చేయడం వలన శరీరంలో నొప్పులు తగ్గుతాయి. అయితే.. స్నానం చేయడానికి ఐస్ వాటర్ వాడవద్దు. చల్లని నీటితో స్నానం చేయవద్దు.
Advertisement
ఒకవేళ స్నానం చేయలేని ఇబ్బంది ఉంటె.. గోరు వెచ్చని నీటిలో ఒక మెత్తని గుడ్డని తడిపి ఒళ్ళంతా తుడవాలి. ఇలా తరచుగా చేయడం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. అయితే.. కొద్దిగా ఓపిక ఉంటె పిల్లలైనా, పెద్ద వారు అయినా స్నానం చేయడమే మంచిది. దీనివల్ల మన ఆరోగ్యానికే మేలు జరుగుతుంది. శరీరంలోని వేడి తగ్గించడంలో స్నానం దోహదపడుతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Vastu tips : ఇంట్లో అప్పుల బాధతో విసుగపోతున్నారా..? ఈ ఒక్క పరిహారంతో మీ సమస్యలన్నీ తీరిపోతాయి .!
శుక్రవారం రోజు పొరపాటున కూడా ఇవి కొనకండి..! లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు..!
నిజశ్రావణ మాసంలో ఈ 4 వస్తువులను తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి..!