Home » రేపు వరలక్ష్మీ వ్రతం చేయాలి అనుకునేవారు ఈ తప్పులు అస్సలు చేయకండి..!

రేపు వరలక్ష్మీ వ్రతం చేయాలి అనుకునేవారు ఈ తప్పులు అస్సలు చేయకండి..!

by Mounika
Ad

 శ్రావణ మాస  రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరించడం అనేది తరతరాలగా జరుగుతుంది. ఈ రోజున స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షు, సంతాన పురోభివృద్ధి, ఐశ్వర్యం, అందం, సంపద మరియు కీర్తి కోసం ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరిస్తారు. ఈ రోజున వరలక్ష్మి రూపమైన  లక్ష్మిని పూజించే ఆచారం ఉంది. వరలక్ష్మి వ్రతం ప్రభావంతో, పేదరికం యొక్క నీడ కూడా  వ్యక్తి జీవితంలో నుండి వెళ్లిపోతుంది. ఈ వ్రతం ఆచరించడం వలనా తరతరాలపాటు  సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ వ్రత కథ వింటేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దక్షిణ భారతదేశంలో వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

Advertisement

వరలక్ష్మి వ్రత కథ :

పురాణాల ప్రకారం, శివుడు స్వయంగా వరలక్ష్మీ వ్రతాన్ని తల్లి పార్వతికి వివరించాడు. పురాణా శాస్త్రాల  ప్రకారం, మగధ దేశంలో కుండి అనే నగరం ఉండేది. లక్ష్మీదేవికి పరమ భక్తురాలు అయిన చారుమతి అనే స్త్రీ ఎక్కడ నివసించింది. చారుమతి లక్ష్మి మాతని ప్రతి శుక్రవారం నాడు ఉపవాసం ఉండి నియమ నిబంధనల ప్రకారం పూజించేది. ఒకసారి చారుమతి కలలో  లక్ష్మిదేవి కనిపించి, శ్రావణ చివరి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించమని కోరింది. చారుమతి  లక్ష్మిమాత ఆజ్ఞ ప్రకారం ఉపవాసం పాటించింది.

Advertisement

చారుమతి పూజ పూర్తి కాగానే వరలక్ష్మి ఆశీస్సులతో ఆమె అదృష్టం మారింది. చారుమతి ఇల్లు  డబ్బుతో నిండిపోయింది. ఆమె శరీరం బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడింది. ఆ తర్వాత నగరంలోని స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని పాటించారు. దాని ఫలితంగా నగరం మొత్తం సంపద మరియు ధాన్యాలతో నిండిపోయింది. లక్ష్మి అనుగ్రహం వల్ల ఇక్కడ నివసించే ప్రజలకు డబ్బుకు లోటు కలగలేదు. అలా దక్షిణ భారతదేశంలో క్రమేనా ఈ వ్రతాన్ని ఆచరించడం  మొదలయ్యింది.

Varalaxmi vratham

 వరలక్ష్మీ వ్రతం నాడు అసలు చేయకూడని పనులు..

వరలక్ష్మి వ్రతం రోజు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి. ఎవరైతే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో ఆ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. మీ మనసులో ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటూ   పూజలు చేయకూడదు. ఇలా ఆచరించే వ్రతం పై మనసు నిమిగ్నమై లేనప్పుడు  మీరు ఎన్ని అలంకరణలు చేసి, ఎంత నైవేద్యం సమర్పించినా మీరు అనుకున్న ఫలితం ఉండదు.  వరలక్ష్మీ వ్రతం ఆచరించినవారు   మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్ర పోకూడదు. అలాగే రాత్రి వేళ అన్నం తినకూడదు. ఏదైనా పండ్లను, పండ్ల రసం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం జోలికి అసలు వెళ్లకూడదు. అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా  వ్రతం ఆచరించే ముందు రోజు, వ్రతం ఆచరించిన రోజు తమ భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

Vastu tips :ఈ మొక్కలు ఇంట్లో ఉంటె వెంటనే తీసేయండి! డబ్బుని అస్సలు రానివ్వవు!

Tulasi mala : ఈ వ్యక్తులు పొరపాటున కూడా తులసి మాల ధరించకూడదు..!

Visitors Are Also Reading